కోలీవుడ్ వేధింపుల‌పై విచార‌ణ క‌మిటీ

మాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, స్త్రీ అస‌మాన‌త‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ ప‌రిశోధ‌న పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

Update: 2024-08-29 11:58 GMT

మాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, స్త్రీ అస‌మాన‌త‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ ప‌రిశోధ‌న పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇరుగుపొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌పైనా దీని ప్ర‌భావం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. తొలిగా కోలీవుడ్ లో దీనిపై కొంత క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు సహా మానవ హక్కుల ఉల్లంఘన కేసులను పరిశీలించేందుకు మరో పది రోజుల్లో ఆర్టిస్టుల‌ సంఘం త‌ర‌పున‌ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ గురువారం నాడు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హేమ కమిటీ లాంటి ప్యానెల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయవచ్చా అనే ప్రశ్నకు బదులిచ్చారు.

ఇది సాధారణంగా `నడిగర్ సంఘం` (కోలీవుడ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్) విధివిధానం అని విశాల్ అన్నారు. అయితే మాలీవుడ్‌లోని నడిగర్ సంఘంతో సమానమైన మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (A.M.M.A.) ద్వారా హేమ కమిటీని ఏర్పాటు చేయలేదు. 2017లో ప్ర‌ముఖ హీరోయిన్‌పై దాడి కేసు తర్వాత, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమైన తర్వాత కేరళ ప్రభుత్వం హేమ కమిటీని ఏర్పాటు చేసింది.

స‌మ‌స్య తీవ్ర‌తను దృష్టిలో ఉంచుకుని.. మరో 10 రోజుల్లో నడిగర్ సంఘం కమిటీ వేయనుంది.. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన వెలువడనుందని... అలా చేయడం మన కర్తవ్యం అని విశాల్ అన్నారు. అసోసియేషన్ అనేది ఇండస్ట్రీలోని పురుషులకే కాదు. తమ కోసం ఎవరైనా ఉన్నారని మహిళా న‌టీమ‌ణులు తెలుసుకోవడం ముఖ్యం`` అని అన్నారు.

కోలీవుడ్‌లోను లైంగిక వేధింపుల సమస్యలు కొనసాగుతున్నాయని అంగీకరించినా కానీ.. విశాల్ తమను తాము రక్షించుకునే బాధ్యతను మహిళలు తీసుకోవాల‌ని అన్నారు. అవును ఆడవాళ్ళంటే గౌరవం లేని, ఇలాంటి డిమాండ్లు చేసే పిచ్చి మనుషులు కచ్చితంగా ఉంటారు. స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. వారు ప్రొడక్షన్ కంపెనీ చట్టబద్ధమైనదేనా? ముందుగా చెప్పిన‌ట్టు సినిమా తీస్తున్నారో లేదో ధృవీకరించుకోవాలి. వారు సైన్ ఇన్ చేసే ముందు వీటన్నింటిని తనిఖీ చేయాలి. వారు నిర్భయంగా ఉండాలి. అలాంటి పురుషులను చెప్పుతో కొట్టగలగాలి!`` అని విశాల్ అన్నాడు.

హేమ కమిటీ నివేదిక విడుదల‌య్యాక, త‌దుప‌రి లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మ‌ల‌యాళ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు, సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ సహా A.M.M.A ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆగష్టు 27 (మంగళవారం నాడు)న‌ తమ రాజీనామాలను సమర్పించిన సంగ‌తి తెలిసిందే.

లైంగిక వేధింపులు లేదా వేధింపుల గురించి మాట్లాడే మహిళలను ``ఇబ్బందులు కలిగించేవారు``గా ముద్ర వేస్తారని, భవిష్యత్తులో కెరీర్ అవకాశాలు రాకుండా చేస్తున్నార‌ని హేమా కమిటీ నివేదికలో కూడా పదేపదే రుజువు అయింది. ఈ రంగంలో స్థిరపడిన మగ తారలు లైంగిక వేధింపులకు పాల్ప‌డ‌డం సర్వసాధారణమని, జయసూర్య, సిద్ధిక్ , సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ వంటి ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు క‌దా! అని విశాల్‌ను ప్ర‌శ్నించ‌గా...ఆ వ్యక్తి అలా చేసినట్లయితే తప్పు.. వారు క‌చ్చితంగా జైలు శిక్ష అనుభవించాలి. స్త్రీ జీవితాన్ని నాశనం చేసిన తర్వాత వారు ఎలా జీవించగలరు? వారు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు! అని విశాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇండస్ట్రీకి వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే ఇలాంటివి చేస్తారు. 80 శాతం మంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నారు.. కానీ మీరు చెప్పినట్లుగా, నిరాశను మాత్రమే ఎదుర్కొంటారు. ఈ విష‌యంలో నాకు ఎలాంటి విభేదాలు లేవు! అని విశాల్ అన్నారు.

Tags:    

Similar News