ఉత్తమ చిత్రమంటే నామినేషన్ కూడా వేయోదన్నా! బన్నీ
69వ జాతీయ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే.
69వ జాతీయ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా కెటగిరిలో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. పుష్పరాజ్ పాత్రకు గానూ బన్నీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. మరి ఇదే సినిమా ఉత్తమ చిత్రం విభాగంలోనూ పోటీ పడిందా? ఆ రకంగానూ ఈ చిత్రాన్ని దర్శక-నిర్మాతలు నామినేషన్ వేసారా? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డు వచ్చినా బన్నీకి సంతృప్తి ఉండేది కాదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `నా అభిమానుల్లో కానీ...సగటు ప్రేక్షకుల్లోగానీ అవార్డు వచ్చేంత నమ్మకం ఉండటానికి కారణం ఒక్కటే. ఈ ఏడాదికి సంబంధించి చాలా పురస్కారాల్లో మేము ముందున్నాం. సినిమాకి అత్యధిక వసూళ్లు వచ్చాయి.
నటన పెద్ద పాత్ర పోషించింది. అలా ఏరకంగా చూసినా మాకు అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో నాకు రాకపోవచ్చు అన్న సందేహం కూడా ఉండేది. సినిమా అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. పుష్ప పాత్ర కూడా ఓ స్మగ్లర్. ఇలా సినిమా నేపథ్యం అవార్డుకి సహకరించకపోవచ్చు అనుకున్నా. ఏదైనా జరిగే అవకాశం ఉందనుకున్నా. కానీ నటనే ప్రామాణికంగా భావించి అవార్డు ఇచ్చారు.
ఆస్కార్ పురస్కారాలకు ప్రపంచంలోనే అత్యధిక ప్రాధాన్యత ఉంది. అక్కడ కూడా నటన ప్రామాణికం తప్ప పాత్ర కాదు. పుష్ప పాత్ర స్మగ్లర్ కావొచ్చు. కానీ అందులో నటనే చూడాలి. అగ్నిపత్ సినిమాలో అమితాబచ్చన్ డాన్ పాత్ర పోషించారు. ఆ సినిమాలో పాత్రకి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. కేవల నటనకి మాత్రమే వచ్చింది. ఇక `పుష్ప` ఉత్తమ చిత్రం విభాగానికైతే నామినేషన్ కూడా వేయోద్దని చెప్పా. ఉత్తమ సినిమా అంటే ఆ సినిమాకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుండాలి. ఓ మంచి సందేశం ఉండాలి. ఇన్ స్పైర్ చేసేలా ఉండాలి` అని అన్నారు.