వీడియో : ఆరు పదుల వయసులో భార్యతో చిన్ననాటి జ్ఞాపకాలు
ఈ మధ్య కాలంలో సినిమాలో కంటే కూడా ఎక్కువగా ఆశిష్ విద్యార్థి యూట్యూబ్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో కనిపిస్తున్నాడు
సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి ఇటీవలే లేటు వయసులో రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రూపాలీ ని ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో చాలా మంది ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ ట్రోల్స్ చేశారు. ఆశిష్ విద్యార్థి పెళ్లి వార్తలు ఆ మధ్య హాట్ టాపిక్ అయ్యాయి.
ఈ మధ్య కాలంలో సినిమాలో కంటే కూడా ఎక్కువగా ఆశిష్ విద్యార్థి యూట్యూబ్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో కనిపిస్తున్నాడు. రెండో భార్య రూపాలి తో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంటున్నాడు. తాజాగా ఆశిష్ విద్యార్థి షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆశిష్ విద్యార్థి కేరళలో పుట్టి పెరిగాడు. రూపాలిని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి సారి తాను పుట్టి పెరిగిన ప్రాంతం కు ఆశిష్ విద్యార్థి వెళ్లాడు. తన భార్య రూపాలితో కలిసి తాను చిన్నతనంలో పెరిగిన గ్రామంకు వెళ్లాడు. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇల్లును చూపించాడు. రూపాలి మొదటి సారి ఇక్కడకు రావడం అంటూ ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు.
ఆరు పదుల వయసులో రెండో భార్యతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో పంచుకున్న ఆశిష్ విద్యార్థి తాజా వీడియోను చాలా మంది విమర్శిస్తూ ఉంటే కొందరు మాత్రం ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు గ్రేట్ అంటూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు.