ఓ మంచి ఛాన్స్.. విశాల్ వినియోగించుకునేనా?
కెరీర్ ఆరంభంలో తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి విజయాలను దక్కించుకున్న విశాల్ ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం లో ఘోరంగా విఫలం అయ్యాడు.
కెరీర్ ఆరంభంలో తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి విజయాలను దక్కించుకున్న విశాల్ ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం లో ఘోరంగా విఫలం అయ్యాడు. తమిళ్ లో అటు ఇటుగా ఆడుతున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో విశాల్ సినిమాలకు మార్కెట్ క్షీణిస్తూ ఉంది. అయితే మార్క్ ఆంటోనీ తో విశాల్ తన సత్తా చాటుకునే అవకాశం దక్కింది.
రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మార్క్ ఆంటోనీ సినిమాకు తమిళనాట పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా బజ్ లేదు. డబ్బింగ్ సినిమాలకు బజ్ లేకున్నా పర్వాలేదు కాస్త పాజిటివ్ టాక్ దక్కితే చాలు భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. విశాల్ కి ఎలాగూ గుర్తింపు ఉంది కనుక పాజిటివ్ టాక్ దక్కింతే చాలు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కొందరిని మెప్పించింది. ఈ సినిమా కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా కూడా మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమిళనాడు పరిస్థితి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో రేపు విడుదల అవ్వబోతున్న సినిమా ల్లో తోపు సినిమా అంటే మార్క్ ఆంటోనీ మాత్రమే అన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తుంది.
ఇతర సినిమాల్లో పెద్దగా పబ్లిసిటీ దక్కించుకున్న సినిమాలు ఏమీ లేవు. పైగా గత వారం లో విడుదలైన సినిమాల సందడి తగ్గింది. కనుక ఈ వారం లో మార్క్ ఆంటోనీ విడుదల అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంటే కచ్చితంగా విశాల్ కి కెరీర్ బెస్ట్ నెంబర్స్ నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మార్క్ ఆంటోనీ తో విశాల్ తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగలిగితే ఆయన రాబోయే సినిమాల విషయంలో ఇక్కడ పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో పాటు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే పోటీ లేని సమయంలో రాబోతున్న ఈ సినిమాకి మంచి ఛాన్స్. మరి విశాల్ ఈ మంచి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటాడా అనేది చూడాలి.