క్యాట్ గుండెల్లో దాండియా ఆడేస్తోందే!
విక్కీ కౌశల్ ని పెళ్లాడిన తర్వాత కత్రినా కైఫ్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.
విక్కీ కౌశల్ ని పెళ్లాడిన తర్వాత కత్రినా కైఫ్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వృత్తికి పెళ్లి అడ్డు కాదని నిరూపించిన మరో నాయిక. ధాంపత్య జీవితానికి...వృత్తికి ఏ మాత్రం సంబంధం లేదని అమ్మడు వృత్తి పరంగా అంతకంతకు బిజీ అవుతుంది. పెళ్లి చేసుకుంది..ఇక తల్లి అవుతుంది! అనుకున్నారంతా. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఇంకా ఆఛాన్స్ తీసుకోలేదని అంది. అయితే వివాహం తర్వాత క త్రినా రూప లావణ్యంలో కొన్ని రకాల మార్పులొచ్చాయి.
సన్నని తీగలా ఉండే భామ కొద్దిగా ఒళ్లు చేసింది. ఆ మాత్రం మార్పులు సహజం. ఆ మార్పు అమ్మడిని మరింత అందంగా ఫోకస్ చేస్తుంది. తాజాగా కత్రినా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తోన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో అమ్మడు ట్రెడీషనల్ డిజైనర్స్ లో ఆకట్టుకుంటుంది. మెడలో చున్నీ...టాప్ టూ బాటమ్ ఒళ్లంతా కవర్ చేసే దుస్తులు అమ్మడి స్కిన్ టోన్ కి పర్పెక్ట్ గామ్యాచ్ అయ్యాయి.
ముఖానికి లైట్ గా మ్యాకప్ నుదిటిన నల్లటి అందదమైన బొట్టు పెట్టుకుని మరింత అందంగా కనిపిస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది క్యాట్ ని అందంగా ఫోకస్ చేస్తున్నాయి. ఎవరికైనా నుదిటిన బొట్టు అందం. ఆ బ్లాక్ స్టిక్కర్ కత్రినా ముఖాన్ని ఎంతో అందంగా మలిచింది. రెగ్యులర్ ఔట్ ఫిట్ కి...డ్రెడీషనల్ దుస్తులకి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కత్రినా ఎంపిక చేసుకున్న భంగిమ సైత ఎంతో బ్యూటీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇక కత్రినా సినిమాల సంగతి చూస్తే సల్మాన్ ఖాన్ సరసన టైగర్ -3లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేసాయి. రిలీజ్ అయిన లిరికల్ సింగిల్స్ శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కత్రినా ఓ రేంజ్ లో ఆకట్టుకోబుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.