పింక్ బ్యూటీలో శామా మెరుపు మురిపం!
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం డిజైనర్ దుస్తుల్లో శామా సెగలు నె ట్టింట చర్చకొస్తుంటాయి. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. హీటెక్కించే ఘాటు ఫోజులతోకుర్రకారుని అలరించడం అమ్మడి ప్రత్యేకత. డిజైనర్ దుస్తులేసినా.. సంప్రదాయ దుస్తులైనా షామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
సినిమా ఛాన్సులు తగ్గినా ఇంకా మీడియాలో ఫాంలో కనిపిస్తుందంటే? కారణం ఈ రకమైన ఎలి వేషన్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అమ్మడు గులాబీ వర్ణం టైట్ ఫిట్ దుస్తుల్లో సెగలు పుట్టిస్తోన్న వైనానికి ఫిదా అవ్వాల్సిందే. పింక్ దుస్తులపై మ్యాచింగ్ యాక్సరసీస్..అమ్మడి అలంకరణ ప్రతీది శామిని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా వదిలింది. `మీరు నన్ను చూస్తున్నారా? లేదా? నేను మీ ద్వారా చూస్తున్నానా! అంట చమత్కరించింది. మరి ఎవరు ఎవరి ద్వారా చూస్తున్నారా? కుర్రాళ్లంతా కామెంట్ బాక్స్ లో చెప్పాల్సిన సమయం వచ్చే సింది. ఎలాంటి కామెంట్లు వస్తాయో చూద్దాం. కానీ శామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు.
ఇక షామా కెరీర్ సంగతి చూస్తే `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.