నా కొడుకుని సూప‌ర్‌స్టార్ ఆదుకోవాలి.. న‌టి ఆవేద‌న‌!

గాయకుడు, సంగీత స్వరకర్త, నటుడు అయిన త‌మ‌ కుమారుడు అవితేష్ శ్రీవాస్తవ గురించి విజ‌య‌తా మాట్లాడారు.

Update: 2024-09-20 02:30 GMT

ప‌రిశ్ర‌మ‌లో కింగ్ పిన్ గా, సూప‌ర్ స్టార్ గా ఎదిగిన‌ షారూఖ్ ఖాన్ త‌న భ‌ర్త‌కు అత్యంత స‌న్నిహితుడు అని, ఆయ‌న‌ చ‌నిపోయేప్పుడు త‌న కుటుంబాన్ని ఆదుకుంటాన‌ని ఖాన్ మాటిచ్చార‌ని, కానీ ఇప్పుడు త‌న కుమారుడు ప‌రిశ్ర‌మ‌లో మార్గ‌ద‌ర్శ‌నం లేని స్థితిలో ఉన్నాడ‌ని ఆవేద‌న చెందారు న‌టి విజ‌య‌తా పండిట్. అంతేకాదు షారూఖ్ త‌న రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ లో త‌న కుమారుడితో సినిమా చేయగ‌ల‌ర‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేసారు. షారూఖ్ అప్ప‌ట్లో నంబ‌ర్ ఇచ్చారు. ఆ నంబ‌ర్ కి ప్ర‌య‌త్నించినా అది ఇప్పుడు ప‌ని చేయ‌డం లేద‌ని, అందువ‌ల్ల అత‌డిని సంప్ర‌దించ‌లేక‌పోయాన‌ని కూడా తాజాగా లెహ్రెన్ రెట్రోకి ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో దివంగత సంగీత స్వరకర్త ఆదేశ్ శ్రీవాస్తవ భార్య, మాజీ నటి విజయతా పండిట్ అన్నారు.

గాయకుడు, సంగీత స్వరకర్త, నటుడు అయిన త‌మ‌ కుమారుడు అవితేష్ శ్రీవాస్తవ గురించి విజ‌య‌తా మాట్లాడారు. తన కుమారుడికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని అన్నారు. విజయతా తన దివంగత భర్త కు మంచి స్నేహితుడు అయిన‌ షారూఖ్ ఖాన్‌ ఆదుకోవాల‌ని అభ్యర్థించారు. విజయత మాట్లాడుతూ, ''అవితేష్ చాలా కష్టపడి ఎకాన్, ఫ్రెంచ్ మోంటానాతో పాటు సంగీతాన్ని రికార్డ్ చేసాడు. కానీ దురదృష్టవశాత్తు నా కొడుకు చిత్ర పరిశ్రమలో స‌రైన మ‌ద్ధ‌తు లేదా మార్గ‌ద‌ర్శ‌నం లేదు. ఈ రోజు పరిశ్రమకు చెందిన వారికి తెలుసు. నా భ‌ర్త ఆదేశ్ లేడు.. ఆదేశ్ హాస్పిటల్‌లో ఉన్నపుడు, చనిపోయే ముందు షారుఖ్ క‌లిసారు. త‌న కుమారుడిని చూసుకోవాల‌ని షారూఖ్ ని ఆదేశ్ కోరారు. షారూఖ్‌ ఇచ్చిన నంబర్ పని చేయడం లేదు. స్నేహితుడికి ఇచ్చిన మాట ప్ర‌కారం.. నా కొడుకు కోసం షారూఖ్‌ రావాలి.. సాయం చేయాలి. ఎందుకంటే నేను సంపాదించడం లేదు.. నేను ఏమీ చేయడం లేదు'' అని ఆవేద‌న‌గా అభ్య‌ర్థించారు.

షారూఖ్ ఖాన్ తన ప్రొడక్షన్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో నా కొడుకుతో కలిసి సినిమా తీయగలడు. అవితేష్ చాలా మంచి నటుడు.. సర్ ఏక్ ఫ్రైడే అనే సినిమా చేస్తున్నాడు. అది OTTలో విడుదల అవుతుంది... అతడు చాలా కష్టపడుతున్నాడు.. ఇది స‌రైన‌ సమయం అని నేను షారూఖ్‌కు గుర్తు చేయాలనుకుంటున్నాను. వచ్చి నా కొడుకుకు కొంచెం సహాయం చేయాలి.. అని అన్నారు. షారూఖ్ ఈరోజు పెద్ద స్టార్.. అయితే నా సోదరులు సంగీత స్వరకర్త ద్వయం జతిన్-లలిత్ షారూఖ్‌ విజయంలో పెద్ద పాత్ర పోషించారని విజయతా గుర్తు చేసారు.

రాజు బన్ గయా జెంటిల్‌మన్ (1992), దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995), కుచ్ కుచ్ హోతా హై (1998) వంటి చిత్రాలకు సూపర్‌హిట్ పాటలు అందించారని తెలిపారు. నా కుటుంబం తన కెరీర్‌కు సాయ‌ప‌డిన‌ట్టే షారూఖ్ కూడా తప్పక నా కుటుంబం కోసం ఏదైనా చేయాలి! అని విజయతా అన్నారు. అమితాబ్ బచ్చన్ ఇంత‌కుముందే దివంగత ఆదేశ్ శ్రీవాస్తవ కుమారుడు అవితేష్ తొలి చిత్రం కోసం శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News