వరుడు హీరోయిన్ బికినీలో ఎంత ట్రై చేసినా కానీ!
వరుడు సినిమాలో కథానాయికగా నటించింది భానుశ్రీ మెహ్రా.
వరుడు సినిమాలో కథానాయికగా నటించింది భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో గుణశేఖర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఆరంగేట్రమే అవకాశం అందుకున్నా అది అదృష్టంగా మారలేదు. తొలి సినిమా డిజాస్టర్ రిజల్ట్ ప్రభావం భానుశ్రీ కెరీర్ పై తీవ్రంగా పడింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళం, కన్నడంలో ఈ భామ నెమ్మదిగా కెరీర్ బండిని నడిపించింది. వెన్నెల కిషోర్ సరసన నటించిన భానుశ్రీ, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, శర్వానంద్ రన్, కీర్తి సురేష్ మిస్ ఇండియా, అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లో సహాయక పాత్రల్లో మెరిసింది.
ఇంతలోనే ఒకానొక సందర్భంలో వరుడు స్టార్ అల్లు అర్జున్ తనను ఇన్ స్టాగ్రమ్ లో అన్ ఫాలో చేయడం నెటిజనుల్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు భానుశ్రీ స్వయంగా బన్ని తనను తిరిగి ఫాలో చేస్తున్నారు అంటూ తెలిపింది. మరోవైపు సోషల్ మీడియాల్లో నిరంతరం ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకునేందుకు భానుశ్రీ చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే శ్రీవ్లాగ్ అంటూ ఒక యూట్యూబ్ చానెల్ ని కూడా ప్రారంభించి బోలెడంత హంగామా సృష్టిస్తోంది. ఇటీవల ఈ చానెల్ ని కూడా లిఫ్ట్ చేసేందుకు కొన్ని ఆసక్తికర విడియోలను పోస్ట్ చేస్తోంది.
ఇందులో భాగంగా భానుశ్రీ పాపులర్ బాలీ బీచ్ వెకేషన్ కి వెళ్లింది. అక్కడి నుంచి బీచ్ లలో బికినీలో చెలరేగిన ఫోటోలు వీడియోలను షేర్ చేసింది. ఫేమస్ బీచ్ ఉలువాటు బీచ్ లో బికినీ ట్రీట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వేడి పెంచుతున్నాయి. తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసేందుకు వీడియో కోసం తీసిన ఈ ఫొటోలను, లింక్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఆసక్తికరంగా భానుశ్రీ బాలీ ట్రిప్ కి తన మదర్ తో కలిసి వెళ్లింది. ఆ వీడియో కూడా వైరల్ గా మారుతోంది.