కిరణ్ 'దిల్ రుబా'.. ఓ పని కంప్లీట్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2024-12-23 17:09 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. మూవీ హిట్ అవ్వడంతో కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇప్పుడు కొత్త డైరెక్టర్ విశ్వ కరుణ్ తో వర్క్ చేస్తున్నారు కిరణ్. రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు దిల్ రుబా అనే టైటిల్ ను రీసెంట్ గా ఫిక్స్ చేశారు. ఆ సమయంలో టైటిల్ తోపాటు స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కిర‌ణ్ ఓ ఛైర్‌ లో కూర్చుని ప‌క్క‌కు చూస్తూ సిగ‌రెట్ తాగుతున్న‌ట్లుగా పోస్టర్ లో క‌నిపిస్తున్నారు.

ఆయ‌న ముందు చాలా మంది ప్రజలు నిల్చుని ఉన్నారు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళతాడంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు మేకర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. క సినిమా తర్వాత కిరణ్ చేస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో దిల్ రుబా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. దిల్ రుబా వ్రేప్.. ప్రతి ఫ్రేమ్‌ లో ప్రేమ, కోపం కథ.. మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే ఎమోషనల్ రోలర్ కోస్టర్ కోసం సిద్ధంగా ఉండండి! ఫిబ్రవరి 2025న థియేటర్‌లో అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ విషయం వైరల్ గా మారింది.

అదే సమయంలో మరో పోస్టర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే దిల్ రుబా.. నిజానికి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడిన కిరణ్ అబ్బవరం.. క మూవీని ముందుగా రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు దిల్ రుబా సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

ఇక దిల్ రుబా మూవీ విషయానికొస్తే.. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏ యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్లపై రవి, జోజో జోష్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో విడుదల అని ప్రకటించారు గానీ.. రిలీజ్ డేట్ చెప్పలేదుగా.. మరి సినిమా ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News