తమన్నా 'ఆజ్ కీ రాత్' తెలుగు వెర్షన్ ఇదే..
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా వరుసగా ప్రత్యేక గీతాలతొ యూత్ ని మత్తెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాలో `కావాలా..` సాంగ్ సెన్సేషన్ హిట్ అయింది
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా వరుసగా ప్రత్యేక గీతాలతొ యూత్ ని మత్తెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాలో `కావాలా..` సాంగ్ సెన్సేషన్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు సాధించిన ప్రత్యేక గీతాల జాబితాలో చేరింది. ఆ తర్వాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం `స్త్రీ-2`లో `ఆజ్ కీ రాత్` సాంగ్ అదే తీరుగా చార్ట్ బస్టర్ అయింది. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ఈ పాట అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు `ఆజ్ కీ రాత్` తెలుగు వెర్షన్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. `నీ కౌగిలిలో అదో హాయిలే..` అంటూ సాగే ఈ పాట వెబ్ లో దూసుకెళుతోంది. లిరిక్ కొంత గజిబిజిగా ఉన్నా కానీ, పాడిన వాయిస్ యూత్ హృదయాలను టచ్ చేస్తోంది. ముఖ్యంగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీట్ పెంచే మూవ్స్ కి ఈ పాటలో కొదవేమీ లేదు. ఇప్పుడు తెలుగు యూత్ లోను దూసుకెళుతోంది.
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 800 కోట్లు వసూలు చేయడం ఒక సెన్సేషన్. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో కల్కి 2898 ఏడి, పుష్ప 2 చిత్రాల తరహాలోనే స్త్రీ 2 కూడా టాప్ 5 గ్రాసర్స్ జాబితాలో నిలిచింది.