తండేల్.. సక్సెస్ గ్లో కనిపిస్తోంది చై
మంచి కంటెంట్ టైమింగ్ కలిసొస్తే విజయం అందుకోవడం ఎవరికీ అంత కష్టం కాదు.
ఇప్పుడున్న కాంపిటీషన్ లో నటవారసులు లెగసీని ముందుకు తీసుకెళ్లడం అంత సులువు కాదు. ఒకప్పటితో పోలిస్తే నేటి జనరేషన్ ఆడియెన్ వేరు. స్టార్ల పిల్లల సినిమాలే చూడాలనే నియమం ఇప్పుడు లేదు. నటుడు ప్రతిభావంతుడు అయితే చాలు. అతడికి అవకాశాలకు కొదవ లేదు. మంచి కంటెంట్ టైమింగ్ కలిసొస్తే విజయం అందుకోవడం ఎవరికీ అంత కష్టం కాదు.
ఇలాంటి కాంపిటీషన్ లోను అక్కినేని నటవారసుడు నాగచైతన్య ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇటీవల పరిణతి చెందిన నటప్రదర్శనతో మెప్పిస్తున్నాడు. అతడి ఎదుగుదలలో దర్శకులు కూడా ఒక భాగం. ఇంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరి` నటుడిగా నాగచైతన్యకు మంచి పేరు తెచ్చింది. ఇంకాస్త ముందు రోజులలోకి వెళితే సుకుమార్ 100 పర్సంట్ లవ్ చిత్రంలో నాగచైతన్య నుంచి అద్భుత నటనను రాబట్టుకున్నాడు. ఇప్పుడు చందు మొండేటి `తండేల్` చిత్రంతో చైతూలోని ప్రతిభను పూర్తిగా వంద శాతం సద్వినియోగం చేసుకున్నాడు. తండేల్ నాగచైతన్య కెరీర్ అత్యధిక గ్రాసర్ గా నిలిచింది.
ఈ సినిమా విజయాన్ని చిత్రబృందం వందశాతాన్ని మించి ఆస్వాధిస్తోంది. అందుకు ఇదిగో సాక్ష్యం. నిన్నటి సక్సెస్ మీట్ లో చైతూ ముఖంలో గ్లో చూస్తే ఈ విషయాన్ని చెబుతోంది. తండేల్ నటుడిగా సంతృప్తిని అందించింది. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద పంపిణీ వర్గాలకు సంతృప్తిని మిగిల్చింది. అన్నివిధాలా అందరూ హ్యాపీగా ఉంటేనే ఏదైనా సాధ్యం. చైతూ బ్లాక్ ఫ్యాంట్.. దానికి కాంబినేషన్ గా నీలి రంగు పర్పుల్ గ్లో షర్ట్ ధరించి ఎంతో స్మార్ట్ గా కనిపించాడు. అంతకుమించి అతడిలో ఆనందం ఆ ముఖంలో స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇక చైతూ ఇదే ఉత్సాహంలో మునుముందు పాన్ ఇండియా మార్కెట్ లో ఎదిగేందుకు ప్రయత్నిస్తాడు అనడంలో సందేహం లేదు. కింగ్ నాగార్జున సహా అక్కినేని కుటుంబం ఇప్పుడు తండేల్ విజయంతో ఎంతో సెలబ్రేషన్ మోడ్ లో ఉంది.