హేమ కమిటీ ఎఫెక్టుతో ఛాన్సులు తగ్గాయా?
తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీవిమర్శకురాలు అనుపమ చోప్రా నిర్వహించిన సమావేశంలో
ఒక అధ్యయనం ప్రకారం.. సినీపరిశ్రమలో మహిళలకు అవకాశాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ఆర్టిస్టుగా, అలాగే ఇతర సాంకేతిక విభాగాల్లో పని చేసే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని సర్వేలు సూచిస్తున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీవిమర్శకురాలు అనుపమ చోప్రా నిర్వహించిన సమావేశంలో ఈ సంవత్సరం దక్షిణాదిన 5 శాతం నుండి 4 శాతానికి మహిళలకు అవకాశాలు తగ్గిపోయాయని వెల్లడించారు.
సౌత్ లో స్త్రీలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక శాతం అదనంగా ఛాన్సులు తగ్గిపోయాయని విశ్లేషించారు. అయితే కొత్త సంవత్సరంలో పరిస్థితులు మెరుగుపడతాయని, మహిళల అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే స్త్రీల పాత్రల కంటే మేల్ పాత్రలను ప్రామాణికతతో తీర్చిదిద్దుతున్నారని, ఇప్పటికీ మహిళలు కొన్ని పనులు చేయలేరని నమ్ముతున్నారని కూడా విశ్లేషించారు. ఆసక్తికరంగా హేమ కమిటీ నివేదిక అందిన తర్వాత కూడా చలనచిత్రపరిశ్రమల్లో వారికి భద్రత పెరగలేదని, సౌకర్యాలను పెంచలేదని ఆరోపించారు.
దక్షిణాదితో పోలిస్తే ఇతర పరిశ్రమల్లో మహిళల ప్రవేశం ఎక్కువగానే ఉంది. కానీ అన్ని పరిశ్రమల్లోను మహిళలకు భద్రత, సౌకర్యాల కల్పన, పారిశుధ్యం, వ్యానిటీ వ్యాన్ సౌకర్యం వంటివి పరిమితంగా ఉన్నాయని, దీనివల్ల కూడా గ్లామర్ రంగంలో మహిళలు తగ్గిపోతున్నారని కూడా విశ్లేషించారు. అనన్య పాండే, రిచా చద్దా, శకున్ బాత్రా, నిక్కిల్ అద్వానీ, పార్వతి తిరువోతు, ఇషితా మోయిత్రా, స్తుతి రామచంద్ర వంటి ప్రముఖులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశాలపై అనుపమ్ చోప్రా చర్చించారు. అయితే హేమ కమిటీ నివేదిక అనంతర పరిణామాలు లేదా మీటూ ఉద్యమం ప్రభావంతో ఈ అవకాశాలు తగ్గలేదు. కేవలం గ్లామర రంగంలో మహిళల ఫ్లో ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత తగ్గింది.