ఫోటో స్టోరి: సాయం సంధ్య‌లో స‌ల‌స‌లా కాగిపోతోంది

బికినీలో దిశా అందాల ఆరబోత మ‌తులు చెడ‌గొడుతోంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

Update: 2024-07-27 15:41 GMT

బికినీలు.. స్విమ్ సూట్లు.. థై స్లిట్ ఫ్రాకులు త‌న‌కు కొత్తేమీ కాదు కానీ.. అన్ని బికినీల్లో ఈ బికినీ వెరీ స్పెష‌ల్ అనిపించేలా ఇప్పుడు దిశా ప‌టానీ ఇచ్చిన ట్రీట్ కి మ‌తి చెడుతోంది. సాయం సంధ్య వేళ‌లో అలా బికినీ బీచ్ లో విహ‌రిస్తూ దిశా నీలి సంద్రంలో స‌ల‌స‌లా కాగిపోతూ క‌నిపించింది. బికినీలో దిశా అందాల ఆరబోత మ‌తులు చెడ‌గొడుతోంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

నిజానికి ఇండ‌స్ట్రీలో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా క్రేజీ స్టార్ గా వెలిగిపోతోంది దిశా ప‌టానీ. ఇటీవ‌లే క‌ల్కి 2989 ఏడి లాంటి పాన్ ఇండియ‌న్ సినిమాతో మ‌రోసారి అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. దిశా వ‌రుసగా క్రేజీ సినిమాల లైన‌ప్ తో చెల‌రేగిపోతోంది. అంతేకాదు ఐఎండిబి లెక్క‌ల ప్ర‌కారం కూడా దిశా ప‌టానీ బెస్ట్ క్రేజీ చిత్రాల్లో న‌టించింద‌ని రిపోర్ట్ అందింది.

IMDb రూపొందించిన 2024 ర్యాంకింగ్స్‌లో రెండు జాబితాలలో మూడు ముఖ్యమైన సినిమాలలో దిశా ప‌టానీ పేరు ఉండ‌టం ఆస‌క్తిని క‌లిగించింది. 2024 లో ఇప్పటివరకు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాలలో మూడింటిలో దిశా న‌టించింది. దిశా పటాని `కల్కి 2898 AD` చిత్రంలో నటించింది. ద్వితీయార్థంలోను దిశా న‌టించిన రెండు క్రేజీ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. దిశా న‌టిస్తున్న `వెల్‌కమ్ టు ది జంగిల్, కంగువ` చిత్రాలు ఐఎండిబి క్రేజీ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ఈ విజయంపై దిశా వ్యాఖ్యానిస్తూ... ఐఎండిబి జాబితాలలో నా చిత్రాలను చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది అద్భుతమైన ప్రయాణం. కల్కి 2898 ఏడి, వెల్‌కమ్ టు ది జంగిల్, కంగువ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి లభించిన ప్రేమ మద్దతుకు ధ‌న్య‌వాదాలు. నా సినిమాల‌తో నేను ప్రేక్షకులను అలరించడానికి .. కనెక్ట్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాను. నా త‌దుప‌రి ప్రాజెక్ట్‌లు కంగువ- వెల్‌కమ్ టు ది జంగిల్ విడుదల కోసం చాలా ఉత్సాహంగా వేచి ఉన్నాను.. అని తెలిపింది.

Tags:    

Similar News