అమ్మ కోసం హీరోయిన్ గా ఆ బ్యూటీ!

ఈ రోజుల్లో మ‌మ్మీ-డాడీ డ్రీమ్స్ ని పుల్ ఫిల్ చేసే వారు ఎంత మంది ఉన్నారు? అంటే వెళ్ల మీద లెక్క పెట్టొచ్చు

Update: 2024-03-24 07:30 GMT

ఈ రోజుల్లో మ‌మ్మీ-డాడీ డ్రీమ్స్ ని పుల్ ఫిల్ చేసే వారు ఎంత మంది ఉన్నారు? అంటే వెళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే అమ్మ‌నాన్న‌ల క‌ల కంటే త‌మ‌కంటూ ఓ సొంత క‌ల ఉంద‌ని రెక్క‌లు క‌ట్టుకుని అటువైపుగా ఎగిరిపోతున్నారు. ఇంకా అవ‌స‌రం అనుకుంటే క‌న్న‌వాళ్ల‌నే వ‌దిలేస్తున్నారు. కానీ దిశా ప‌టానీ మాత్రం అందుకు భిన్నం. అమ్మ‌నాన్న‌ల క‌న్నా ఏదీ ముఖ్యం కాదంటూ త‌న‌క‌ల‌ని సైతం ప‌క్క‌న‌బెట్టి మ‌మ్మీ డ్రీమ్ ని నెర‌వేర్చిన గొప్ప కుమార్తె అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అవును హీరోయిన్ అవ్వ‌డం అన్న‌ది దిశా ప‌టానీ డ్రీమ్ కాదు. వాళ్ల అమ్మ క‌ల‌. కాలేజీ రోజుల్లోనే వాళ్ల అమ్మ పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని క‌లలు క‌నేదిట‌. ఎక్కువ‌గా మ్యాక‌ప్ వేసుకుని త‌న‌ని తానే అద్దంలో చూసుకోవ‌డం..హీరోయిన్ గా ఫీల‌వ్వ‌డం వంటివి చేసేద‌ట‌. కానీ హీరోయిన్ గా వెళ్తానంటే ఇంట్లో త‌ల్లిదండ్రులు ఒప్పుకోక పోవ‌డంతో ఆ క‌ల‌ని అక్క‌డే స‌మాధి చేసి కొత్త జీవితం ప్రారంభించిన‌ట్లు చెప్పుకొచ్చింది.

అందుకే అమ్మ ఎలాగూ హీరోయిన్ కాలేక‌పోయింద‌ని భావించిన దిశాప‌టానీ తానైనా అమ్మ కోరిక నెర వేర్చాల‌ని సినిమా రంగంలోకి వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఆర‌కంగా అమ్మ డ్రీమ్ నెర‌వేరింద‌ని తెలిపింది. ఇప్పుడా కుమార్తెని హీరోయిన్ గాచూసుకుని అమ్మ ఎంత సంతోషంగా ఉందో? మాట‌ల్లో చెప్ప‌లేనిదే. ఎందుకంటే మ‌నం సాధించ‌లేనిది కొడుకు..కూతురు సాధిస్తే ఇంకా ఎక్కువ‌గా ఆనందంగా ఉంటుంది. జీవితంలో గొప్ప ప్ర‌యోజ‌కులు అయ్యార‌ని త‌ల్లిదండ్రులు క‌న్నా ఎక్కువ‌గా సంతోషించేది ఎవ‌రుంటారు.

దిశాప‌టానీ 'లోఫ‌ర్' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు తొలిసారి మ్యాక‌ప్ వేసుకుంది తెలుగు సినిమాతోనే. కానీ ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత 'ధోనీ'..'భాగీ' విజ‌యాల‌తో బాగా ఫేమ‌స్ అయింది. అక్క‌డ నుంచి కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ముందుకెళ్తుంది. ప్ర‌స్తుతం సౌత్ లో రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. అవే తెలుగు నుంచి 'కల్కీ'..త‌మిళ్ నుంచి 'కంగువా'. ఈ రెండు సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి.

Tags:    

Similar News