ఆ హీరోయిన్ చనిపోయిందంటూ వార్తలు..నిజమిదే..!
కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు
కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. అయితే, ఆమె గురించి తాజాగా ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఆమె గుండె నొప్పితో చనిపోయిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో, ట్విట్టర్ లో ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ వార్తలు మరీ ఊపందుకోవడంతో, ఏకంగా ఆమె కుటుంబసభ్యులు స్పందించారు.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రమ్య కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. మొదట ఓ ప్రముఖ ఓ పీఆర్వో రమ్య హార్ట్ ఎటాక్ తో చనిపోయిందంటూ వార్త ట్వీట్ చేసిందని, అది వైరల్ గా మారిన తర్వాత, ఆ ట్వీట్ ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈలోగానే ఆ ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారిపోయింది.
రమ్యకి ఏమీకాలేదని, ఆమె బతికేఉన్నారని తాజాగా ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రమణ్యం కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. 'ఇప్పుడే రమ్యతో మాట్లాడాను, ప్రస్తుతం ఆమె జెనీవాలో ఉంది. గురువారం బెంగళూరుకి వస్తుంది' అని ట్వీట్ చేశారు.
మొదట రమ్య చనిపోయిందని తెలియగానే అందరూ షాకయ్యారు. తర్వాత అది అబద్దం అని తెలియడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రమ్య పేరుకు కన్నడ నటి అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె కళ్యాణ్ రామ్ తో కలిసి అభిమాన్యూ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయనప్పటికీ, డబ్బింగ్ సినిమాల ద్వారా చేరువయ్యారు.
సూర్యతో కలిసి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆమె పాత్రకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు ఆమె దాదాపు 40 సినిమాలకు పైగా నటించింది. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో కాంగ్రెస్ సరసపున మాండ్యా నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఆతర్వాతి ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. కానీ, ఇప్పటికీ రాజకీయాల పరంగా ఆమె చాలా యాక్టివ్ గా ఉన్నారు. చివరగా రమ్య
'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే'సినిమాలో నటించారు. ఈ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ గా విడుదల చేశారు. కన్నడలో ఆమె చేసిన పాత్రను తెలుగులో యాంకర్ రష్మి పోషించారు.