అతిలోక సుందరిలా జాన్వీ అందాల కనువిందు!

ఊహించని విధంగా తెలుగులో మొదటి చిత్రమే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని జాన్వీ కపూర్ సొంతం చేసుకుంది

Update: 2023-10-14 08:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ధడక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత తండ్రి ప్రోత్సాహంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే బాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ జతకట్టింది తక్కువ అని చెప్పాలి.


ఊహించని విధంగా తెలుగులో మొదటి చిత్రమే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని జాన్వీ కపూర్ సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న దేవర మూవీలో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్. ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇన్ స్టాగ్రామ్ లో 22.1 మిలియన్ ఫాలోవర్స్ ని జాన్వీ కపూర్ కలిగి ఉంది. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీ స్టార్స్ లో జాన్వీ టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. అందుకి ఈమె చేసే అండార్స్మెంట్స్ కి కొట్లలో ఆదాయం ఆర్జిస్తోంది. ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఫ్యాషన్ ఐకాన్ గా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటుంది.

ఇప్పటికప్పుడు కొత్త కొత్త డిజైనర్ కాస్ట్యూమ్స్ తో ఫాలోవర్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది. అందుకే ఇన్ స్టాలో జాన్వీని మిలియన్స్ లో ఫాలో అవుతారు. తాజాగా ఈ అమ్మడు లాంగ్ డిజైనర్ ఫ్రాక్ తో థిస్ అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలని 6.19 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఈ పిక్స్ లో జాన్వీ కపూర్ అతిలోక సుందరిలా, దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News