అంద‌గాడిని ప‌ట్టుకుని 'బ‌న్ బాబు' అనేదా?

పాత‌త‌రం న‌టీన‌టుల మ‌ధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంతా క‌లిసి మెలిసి ప‌నిచే సేవారు

Update: 2024-03-14 03:00 GMT

పాత‌త‌రం న‌టీన‌టుల మ‌ధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంతా క‌లిసి మెలిసి ప‌నిచే సేవారు. హీరో అనే ఇమేజ్ తో ప్ర‌త్యేకంగా ఉండ‌టం అంటూ ఉండేది కాదు. హీరో..హీరోయిన్..ఇత‌ర న‌టీ నటులు షూటింగ్ అంతా ఓ పండ‌గ వాతావ‌ర‌ణంలో పూర్తి చేసుకుని వ‌చ్చేవారు. ఔట్ డోర్ షూటింగ్ లు అయితే మరింత స‌ర‌దాగా జ‌రిగేవి. వంట వార్పు...అన్నీ అంద‌రికీ స‌మానంగా ఉండేది. ప్ర‌త్యేకంగా స్టార్ హోట‌ళ్ల నుంచి తెప్పించే ఇప్ప‌టికీ క‌హానీలేవి అప్ప‌ట్లో ఉండేవి కాదు.

అలా అంతా క‌లిసి మెలిసి ప‌నిచేయ‌డంతో న‌టీన‌టుల మ‌ధ్య స్నేహ‌భావం బ‌లంగా ఉండేది. తాజాగా ఆనాటి పాత జ్ఞాప‌కాల్ని స‌హ‌జ న‌టి జ‌య‌సుధ మ‌రోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రా అంద‌గాడు శోభ‌న్ బాబు తో హీరోయిన్లు ఎలా ఉండేవారు? అన్న సంగ‌తులు పంచుకున్నారు. అవేంటో ఆమె మాట‌ల్లోనే..'నేను .. శోభన్ బాబు గారు షూటింగు సమయంలో చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్లం. ఆయన కి చాలా సమయస్ఫూర్తి ఎక్కువ. హీరోయిన్ రాధిక ఆయనను 'బన్ బాబు' అని పిలిచేది.

ఆ పిలుపు విన‌ప‌డ‌గానే అంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే వాళ్లం. అలాగ‌ని శోభ‌న్ బాబు ఫీల్ అయ్యేవారు కాదు. మాతో పాటు ఆయ‌న కూడా న‌వ్వేవారు. తన ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే భయపడేవారు. ఓసారి శోభన్ బాబుగారి దగ్గరికి చంద్రమోహన్ గారు వెళ్లినప్పుడు జయసుధను కాల్ చేయమని చెప్పు అన్నారట. ఆ విషయాన్ని చంద్రమోహన్ గారు నాకు చెప్పారు . కానీ ఆ సమయంలో నేను కొంచెం బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. వారం తిరిగేలోగా శోభన్ బాబుగారు చనిపోయారని తెలిసి షాక్ అయ్యాను. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త నాకు ఇప్ప‌టికీ షాకింగ్ గానే అనిపిస్తుంది' అని అన్నారు.

Tags:    

Similar News