బ్లాక్ డ్రెస్ లో కేతిక హీటెక్కించే స్టిల్

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కేతిక శర్మ

Update: 2024-01-28 09:18 GMT

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కేతిక శర్మ. ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలను ఈ అమ్మడు అందుకుంటూ వచ్చింది. లక్ష్య సినిమాలో నాగశౌర్య జోడిగా రెండో మూవీ చేసింది.


రంగ రంగ వైభవంగా సినిమాలో మెగా హీరో వైష్ణవ తేజ్ తో జతకట్టింది. బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ ప్రియురాలి పాత్రలో కనిపించింది. ఇలా ఆరంభంలోనే ఏకంగా యంగ్ స్టార్ హీరోలతో నటించే అవకాశం కేతిక శర్మ రావడం నిజంగా విశేషం అని చెప్పాలి. అయితే అందానికి అందం, అంతకుమించిన గ్లామర్ షో చేసే అవకాశం ఉన్న ఈ బ్యూటీ నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బోల్డ్ పర్ఫామెన్స్ చేయడానికి కూడా కేతిక శర్మ రెడీగా ఉన్నా కూడా సక్సెస్ మాత్రం రావడం లేదు.


అయితే ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేతిక రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. సినిమాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చే హైప్ కారణంగా ఈ బ్యూటీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం అయితే కేతిక శర్మ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కానీ ఫ్యాషన్ ఈవెంట్స్ చేస్తూ వస్తోంది.

తాజాగా ఇన్ స్టాలో కేతిక అదిరిపోయే షార్ట్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో బ్లాక్ జాకెట్ ధరించి హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు హీట్ ఎక్కిస్తుంది. కేతిక గ్లామర్ షోకి అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరైన బ్రేక్ ఇచ్చే మూవీ పడితే కేతిక శర్మ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అనే మాట ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. కేతిక అందాలను ఆస్వాదించే అభిమానులు డిఫరెంట్ కామెంట్లతో ఆమె బ్యూటీకి కితాభిస్తున్నారు.

Tags:    

Similar News