మాధవి ముగ్గురు కుమార్తెలు మామ్ కి అచ్చు గుద్దినట్లే!
ఒకప్పటి అందమైన హీరోయిన్ మాధవి గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో వెండి తెరపై తానో అద్భుతం.
ఒకప్పటి అందమైన హీరోయిన్ మాధవి గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో వెండి తెరపై తానో అద్భుతం. అందమైన హీరోయినే కాదు..అంతకు మించి గొప్ప నటి. 80-90 దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి, విజయశాంతి, జయసుధు, జయప్రద లాంటి వాళ్లకే పోటీగా నిలిచిన హీరోయిన్ మాధవి. చిరంజీవి-మాధవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి.
`ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య`, `చట్టంతో పోరాటం`, `మరణశాసనం`, `రోషగాడు`, కోతల రాయుడు`, `దొంగమొగుడు`, `కుక్క కాటుకు చెప్పు దెబ్బ`, `బిగ్ బాస్` వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఖైదీలో `రగులుతోంది మొగలిపొద` అంటూ చిరంజీవి తో కలిసి సంచనలమే సృష్టించింది. ఆరోజుల్లోనే బికినీ బ్యూటీగానే పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించింది.
ఇక వివాహం తర్వాత మాత్రం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చింది. వ్యాపారవేత్త రాల్ప్ శర్మని 1996లో వివాహం చేసుకుంది. అటుపై అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం బిజినెస్ పనులు చూసుకుంటుంది. మాధవికి ముగ్గురు కుమార్తెలు. తాజాగా వాళ్ల ఫోటోలను మాధవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ముగ్గురు కూడా అమ్మ పొలికలతో అచ్చు గుద్దినట్లే ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు టిఫనీ, కాగా రెండో కూతురు ప్రిసిల్లా, మూడో కుమార్తె పేరు ఎవలిన్. ముగ్గురికి భరతనాట్యంలో మంచి శిక్షణ ఇప్పించింది. మరి ఈ అందమైన కుమార్తెలను మాధవి సినిమా ఫీల్డ్ లోకి దించుతుందా? లేదా? అన్నది చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్...తన తోటి తారల పిల్లలు ట్రాక్ చెక్ చేసుకుని అన్నీ అనుకులంగా ఉంటేనే లాంచ్ చేస్తుంది. లేదంటే ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడే అవకాశం ఉంది.