అందాల బుసలు.. నాగిని భామ రచ్చ..!

లాస్ట్ ఇయర్ బ్రహ్మస్త్ర లో జునూన్ అనే నెగిటివ్ పాత్రలో నటించిన మౌనీ రాయ్ ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ సినిమాలో నటిస్తుంది

Update: 2023-11-29 04:00 GMT

బాలీవుడ్ అందాల భామ మౌనీ రాయ్ గ్లామర్ షో గురిచి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగిని సీరియల్ తో సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గరైన అమ్మడు సినిమాల కన్నా తన సోషల్ మీడియా తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అమ్మడు ఫోటో షూట్స్ చూస్తే కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్కిన్ షోలో ఎలాంటి మొహమాట పడని అమ్మడు రెచ్చగొట్టే అందాలతో ఫాలోవర్స్ కి నిద్రపట్టకుండా చేస్తుంది.


లాస్ట్ ఇయర్ బ్రహ్మస్త్ర లో జునూన్ అనే నెగిటివ్ పాత్రలో నటించిన మౌనీ రాయ్ ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటుగా డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ 12వ సీజన్ జడ్జిగా కూడా చేస్తుంది మౌనీ రాయ్. సినిమాలు షోలు ఉన్నా లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అలరిస్తుంది మౌనీ రాయ్.

లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ డ్రెస్ లో స్లీవ్ లెస్ అందాలతో రచ్చ చేస్తుంది. బ్లాక్ స్లీవ్ డ్రెస్ టైట్ డ్రెస్ లో అలా తమ సోయగాల వల వేస్తుంది అమ్మడు. హెయిర్ అలా లూజ్ గా వదిలేయడంతో మరింత అందంగా ఉంది. అలా ఓ పక్కకి చూస్తున్న అమ్మడు తనని చూసే వారిని పట్టించుకోవట్లేదనే చెప్పాలి. ఫోటో షూట్స్ విషయంలో స్టార్ హీరోయిన్స్ కు ధీటుగా మౌనీ రాయ్ షో అమ్మడికి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది.

తన ఫాలోవర్స్ ని ఎప్పుడు నిరుత్సాహ పరచకూడదు అనుకుంటున్న మౌనీ రెండు రోజులకు ఒక ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తన గ్లామర్ దాటికి మిగతా వారంతా సైడ్ అవ్వాల్సిందే అనిపించేలా మౌనీ అందాల తాకిడి ఉంది. సౌత్ సినిమాల మీద మంచి అభిప్రాయమే కలిగి ఉన్న మౌనీ తనకు ఛాన్స్ వస్తే తప్పకుండా ఇక్కడ నటిస్తానని చెప్పుకొచ్చింది. మరి అమ్మడి టాలెంట్ ని చూసి మన మేకర్స్ ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. తెలుగులో మౌనీ నటిస్తే మాత్రం ఆమెకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. నాగిని సీరియల్ ని తెలుగు ఆడియన్స్ తెగ చూశారు. అందుకే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా ఎవరైనా డైరెక్టర్ మౌనీ రాయ్ తో సినిమా చేస్తే ఆమె ఇక్కడ కూడా కెరీర్ కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News