ప్లాప్ తర్వాత న్యూయార్క్ లో యాక్టింగ్ ట్రైనింగ్!
కొంతమంది సినిమాల్లోకి వచ్చేముందే అన్నిరకాలుగా ఆరితేరి దిగుతారు. యాక్టింగ్...డాన్సు...ఇలా ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్స్ అన్నింటిని పక్కాగా నేర్చుకుని తెరంగేట్రం చేస్తుంటారు
కొంతమంది సినిమాల్లోకి వచ్చేముందే అన్నిరకాలుగా ఆరితేరి దిగుతారు. యాక్టింగ్...డాన్సు...ఇలా ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్స్ అన్నింటిని పక్కాగా నేర్చుకుని తెరంగేట్రం చేస్తుంటారు. ముఖ్యంగా వారసులు ఈ విషయంలో పక్కా ప్లానింగ్ తో దిగుతారు. వాళ్లకంటూ ప్రత్యేకంగా ఓ గైడైన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఇబ్బందులుండవు. అయితే అనుకోకుండా అవకాశాలు వచ్చి నిలదొక్కు కున్నవారు లేకపోలేదు.
అనుష్క అలా ఇండస్ట్రీకి వచ్చింది. బెంగుళూరు లో యోగా పాఠాలు బోధించే అనుష్కని తీసుకొచ్చి పూరి జగన్నాధ్ పెద్ద హీరోయిన్ చేసాడు. తొలి సినిమా చేసే సమయానికి ఎలాంటి అనుభవం లేదు. వచ్చింది ..చేసింది సక్సెస్ అయింది. అంతే అక్కడ నుంచి ఆమెకి ఎలాంటి ట్రైనింగ్ లు లేవు. తనకు తానుగానే ఎదిగేసింది. అయితే ఇలా అందరికీ వర్కౌట్ అవ్వదు. 'మెహబూబ' సినిమాతో లాంచ్ అయిన నేహాశెట్టి సుపరిచితమే.
ఈ భామ కూడా పూరి బ్రాండ్ తోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పరాజయం చెందడంతో! నేహకి పేరు రాలేదు. దీంతో తన బలహీనతల్ని గుర్తించిన అమ్మడు వెంటనే న్యూయార్క్ ట్రైనింగ్ లో ఇనిస్ట్యూట్ లో చేరినట్లు తాజాగా ఓఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ట్రైనింగ్ అనంతరం ఎన్నో ఆశలతో మళ్లీ టాలీవుడ్ కి వచ్చిందిట. అయితే అప్పుడే కోవిడ్ కూడా మొదలవ్వడంతో చాలా సమయం వృద్ధగా పోయిందని తెలిపింది. ఆ సమయంలోనే డీజే టిల్లులో అవకాశం వచ్చింది.
'రాధిక పాత్రతో అందరికీ బాగా కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నేహ కి బధులుగా బయట వారంతా రాధిక వచ్చింది అనడం మొదలు పెట్టారు. అది ఓ గమ్మతైన పాత్ర. ఆ పాత్ర విషయంలో ఎక్కడా తప్పిదాలు దొర్లినా ప్రేక్షకులు నన్ను అసహ్యించుకునేవారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ చేసింది రాధిక పాత్ర అని చెప్పగలను. న్యూయార్క్ లో నేను తీసుకున్న ట్రైనింగ్ ఆ సినిమాకి బాగా ఉపయోగపడింది' అని తెలిపింది.