గ్లోబల్ బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
గ్లోబల్ స్టార్ గా ప్రియాంక చోప్రా ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కెళ్లి అక్కడా చక్రం తిప్పుతుంది
గ్లోబల్ స్టార్ గా ప్రియాంక చోప్రా ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కెళ్లి అక్కడా చక్రం తిప్పుతుంది. హిందీ పరిశ్రమ నుంచి హాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని ఎంతో మంది భామలు ప్రయత్నించినా..ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా వాళ్లెవరికీ సాధ్యం కానిది పీసీ సాధ్యం చేసి చూపిం చింది. ఎదిగే క్రమంలో స్వదేశం నుంచి కొన్నిరకాల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ వాటిని పట్టించుకో కుండా ఎదిగిన నటి.
వ్యక్తిగతంగా ఆ విమర్శలు ఆమె మనసు నొచ్చుకునేలా చేసినా...లక్ష్య ఛేదనలో అవేం అడ్డంకి కాదని నిరూపించింది. పీసీ ఇలా ఎదగడానికి ఎంతో శ్రమించింది. అయితే గ్రౌండ్ లెవల్ లో తన వర్క్ ఎలా ఉంటుంది? అన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. 'నేను చేసే ఏ పాత్ర అయినా సరే ముందు దాన్ని బాగా చదువుతాను. ఆ తర్వాత సినిమా కథ ఆసక్తికరంగా ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటాను.
రాత్రికి రాత్రే నిర్ణయం చెప్పను. బాగా ఆలోచిస్తాను. నా పాత్ర పరంగా వెయిట్ ఎలా ఉంటుంది? తుది పలితం ఎలా ఉంటుందో ఊహిస్తాను. సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది తర్వాత సంగతి ముందు నావైపు నుంచి అన్ని రకాలుగా ఆలోచించడం మొదలు పెడతాను. అందులో నాకు ఎలాంటి సందేహాలున్నా...నిర్ణయాలు తీసుకోవడంలో కన్ ప్యూజన్ కి గురవుతున్నాను అనిపించినా వెంటనే నాకు తెలిసిన దర్శక-నిర్మాతలతో చర్చిస్తాను.
మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి. అందులో అదొక భాగం. కథ నచ్చి సినిమాలో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మళ్లీ మూడు దశలు అనుసరిస్తాను. తప్పకుండా నన్ను ఆడిషన్ చేయమని కోరతాను. దర్శక-నిర్మాతలతో సమావేశం.. కథని చదివి అర్దమయ్యేలా చర్చించడం.. స్టూడియోకి వెళ్లి పనులు మొదలు పెట్టడం. ప్రతీ సినిమాకి ఈ మూడు దశలు కచ్చితంగా అనుసరిస్తాను. ఏ విషయం నేర్చుకోవడానికైనా అహంకారం అనేది అడ్డు రాకూడదు. అహంకారం కలల ముందు ఎప్పుడూ నిలబడదు. కృషి ..పట్టుదల..వినయం మాత్రమే ఏ రంగంలోనైనా పైకి తీసుకెళ్తాయి' అని అన్నారు.