హీరోయిన్ల పారితోషికాల్లోనూ కోత పడుతుందా?
కాస్టింగ్ ఖర్చు పెరిగిపోవడంతో నిర్మాణంపై భార పడుతుందని నిర్మాతలంతా తమ వెర్షన్ చెప్పుకోవడంతో చాలా మంది హీరోలు దిగొచ్చారు.
స్టార్ హీరోయిన్ల బడ్జెట్ లో కోత పడుతోందా? పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చుంటామంటే నిర్మాతలు ఒప్పుకోవడం లేదా? కోట్లలో డిమాండ్ చేసిన భామలంతా లక్షలకు పడిపోయే సన్నివేశం ఎదురవుతోందా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే పారితోషికం విషయంలో హీరోల్ని ఓ మెట్టు దిగి రమ్మని సినీ పెద్దలంతా చర్చలు జరిపారు. చాలా మంది స్టార్ హీరోలు తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు.
కాస్టింగ్ ఖర్చు పెరిగిపోవడంతో నిర్మాణంపై భార పడుతుందని నిర్మాతలంతా తమ వెర్షన్ చెప్పుకోవడంతో చాలా మంది హీరోలు దిగొచ్చారు. హీరోలంతా సినిమా బడ్జెట్ ని బట్టి తమ పారితోషికం విషయంలో ఓ అంచనాకి వచ్చి ఛార్జ్ చేస్తున్నారు. గత ఏడాదిన్నన కాలంగా ఈ సన్నివేశం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. మరి హీరోయిన్ల సంగతేంటి? అంటే ఇంత కాలం వాళ్లని నిర్మాతంలంతా లైట్ తీసుకున్నారు. వాళ్లకు ఇచ్చే ఐదు కోట్లలో కోత వేయడం ఎందుకని సీరియస్ గా తీసుకోలేదు.
అయితే నిర్మాతకు అదనపు ఖర్చు తగ్గించాలని సూచించారు. అందుకు తగ్గట్టు హీరోయిన్లు కూడా తమ వ్యక్తిగత సిబ్బందిని...ఖర్చుల్ని తగ్గించుకోవడం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో సినిమా బిజినెస్ కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. అంత ఈజీగా డిజిటల్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగినా అందులో బోలెడన్నీ కండీషన్లు ఉంటున్నాయి. వాటన్నింటిని నిర్మాత సాటిస్పై చేయగలిగితేనే ఓటీటీ ప్లాట్ ఫాంలు ముందు కొస్తున్నాయి. లేదంటే? కంటెంట్ మాకొద్దని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాయి.
కొని నష్టపోవడం కన్నా విక్రయించకుండా సేఫ్ జోన్ లో ఉంటేనే మంచిదని భావిస్తున్నాయి. మార్కెట్ లో ఓటీటీల మధ్య విపరీతమైన పోటీ ఉన్నా కార్పోరేట్ ఓటీటీలు ఇంతకు మునుపులా ముందుకు రావడం లేదు. కంటెంట్ పై ఏమాత్రం చిన్న నెగిటివ్ టాక్ ఉన్నా మధ్యలోనే ఒప్పందం బ్రేక్ చేసుకుంటున్నారు. అప్పటికి అడ్వాన్స్ గా ఇచ్చిన పేమెంట్ తప్ప రిమైనింగ్ అమౌంట్ నిర్మాతకి రిటర్న్ చేయాల్సిందేనని కండీషన్లో ఉందిట.
దీంతో నిర్మాతలిప్పుడు కొత్తగా హీరోయిన్ల పారితోషికంలోనూ కోత విధించాలని భావిస్తున్నారుట. ఐదు నుంచి పదికోట్లు మధ్యలో ఛార్జ్ చేస్తోన్న హీరోయిన్లందర్నీ లిస్ట్ ఔట్ చేసి పారితోషికం విషయంలో కండీషన్లు పెడు తున్నారుట. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇంత..కాకపోతే కొంత అన్నట్లు కొత్త రూల్ తీసుకొచ్చే ప్రతి పాదనలో ఉన్నారుట. ఇదే రూల్ లక్షల్లో పారితోషికం అందుకుంటోన్న వారికి కూడా వర్తిస్తుందని సమాచారం.