బ్యాక్ అందాలతో హీటేక్కిస్తున్న రుహనీ పాప
ఓ వైపు తెలుగు, తమిళ్ భాషలలో ఒక్కో అవకాశం అందుకుంటూ ఎదుగుతోన్న ఈ అమ్మడు ఆగ్రా అనే మూవీతో బాలీవుడ్ లోకి వెళ్ళింది
చిలసౌ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ రహానీ శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని ఈ బ్యూటీ తన ఖాతాలో వేసుకుంది. తరువాత హిట్ సిరీస్ లో వచ్చిన మొదటి భాగంలో రుహనీ శర్మ నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే తెరంగేట్రం చేసింది మాత్రం తమిళ్ మూవీతో. చిలసౌ తర్వాత కూడా తమిళంలో కమల అనే మూవీలో నటించింది.
ఓ వైపు తెలుగు, తమిళ్ భాషలలో ఒక్కో అవకాశం అందుకుంటూ ఎదుగుతోన్న ఈ అమ్మడు ఆగ్రా అనే మూవీతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. రీసెంట్ గా వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమాలో ఒక కీలక పాత్రలో రుహనీ శర్మ నటించింది. సినిమాలు చేస్తూనే మరో వైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పాయిజన్, మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి.
అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చే ఫేం కంటే ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువ గుర్తింపు సంపాదిస్తుందని చెప్పాలి. దానికి కారణం సినిమాలలో రుహనీ శర్మ పక్కింటి అమ్మాయి తరహాలో డీసెంట్ పాత్రలే ఎక్కువ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా క్లాస్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ ని దర్శకులు కూడా ఆమెకి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రుహనీ అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుంది.
రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఈ బ్యూటీ ఇన్ స్టా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తనలోని హాట్ నెస్ ని బయటకి తీసుకొస్తూ కలర్ ఫుల్ డ్రెస్సులతో కిక్ ఎక్కిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతాయి. రీసెంట్ గా బ్లౌజ్ లేకుండా గ్రీన్ కలర్ శారీతో ఫోటోలకి ఫోజులిచ్చిన ఈ బ్యూటీ తాజాగా బ్యాక్ అందాలని చూపిస్తూ కుర్రాళ్ళకి హిట్ పెంచేసే విధంగా పిక్స్ ని షేర్ చేసింది.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఆమె అందాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె అందాల ప్రదర్శన చూసిన తర్వాత అయిన దర్శక, నిర్మాతలు కాస్తా గ్లామర్ టచ్ ఉన్న పాత్రలని ఆమెకి ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.