రెడ్ ఫ్రాక్ తో రుహి పాప.. మైండ్ బ్లోయింగ్
నార్త్ ఇండియన్ అందాల భామలు ఓ వైపు మోడలింగ్ చేస్తూ మరో వైపు సినిమాలలో కథానాయకిలుగా రాణిస్తున్నారు
నార్త్ ఇండియన్ అందాల భామలు ఓ వైపు మోడలింగ్ చేస్తూ మరో వైపు సినిమాలలో కథానాయకిలుగా రాణిస్తున్నారు. సినిమాలు తక్కువ చేస్తున్న ఈ బ్యూటీస్ తమ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోతున్నారు. ఒకప్పడు హీరోయిన్స్ తమని తాము షోకేస్ చేసుకోవడానికి సరైన ప్లాట్ ఫామ్స్ ఉండేవి కావు. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ అందాల భామల హాట్ షోకి మంచి వేదిక అయ్యింది.
రుహి సింగ్. ఈ పేరు సౌత్ లో పెద్దగా పాపులారిటీ కాదు. కాని ఫ్యాషన్ రంగం గురించి తెలిసిన వారికి సుపరిచితమే. హిందీలో క్యాలెండర్ గర్ల్స్ మూవీతో నటిగా ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఇష్క్ ఫర్ ఎవర్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో మంచువిష్ణు పాన్ ఇండియా మూవీ మోసగాళ్ళు చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.
తమిళంలో ఒక చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలు అయితే హీరోయిన్ గా ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కాని డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆరు వెబ్ సిరీస్ లలో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో రుహి సింగ్ సందడి చేస్తూ ఉంటుంది. 2.1 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఈ అమ్మడుకి ఉన్నారు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా గ్లామర్ షోకి ఈ అమ్మడు సై అంటుంది. తాజాగా హాట్ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో రుహి సింగ్ అదరగొట్టింది.
రెడ్ కలర్ లాంగ్ ప్రాక్ వేసి థైస్ అందాలతో చూపిస్తూ వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. చూపులతో వలపుల బాణాలు విసురుతూ కుర్రాళ్ళని ఎంటెర్టైన్ చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రుహి సింగ్ అందాల ప్రదర్శనపై నెటిజన్లు కూడా డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు.హార్ట్, లవ్ సింబల్స్ తో ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.