సీక్వెల్‌, రీ రిలీజ్‌లపై రానా క్లారిటీ

త్వరలోనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2025-02-13 15:33 GMT

వెంకటేష్‌, రానా కలిసి నటించిన మొదటి వెబ్‌ సిరీస్ 'రానా నాయుడు' 2023లో స్ట్రీమింగ్‌ అయింది. వెబ్‌ సిరీస్‌లో బూతులు ఎక్కువ ఉన్నాయి అంటూనే అత్యధికంగా ప్రేక్షకులు చూశారు. సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు విమర్శించగా, మరి కొందరు మాత్రం రానా నాయుడు సిరీస్‌ బాగుందనే కామెంట్స్ చేశారు. మొత్తంగా వెబ్‌ సిరీస్‌ హిట్‌ కావడంతో సీక్వెల్‌ రూపొందింది. గత ఏడాదిలోనే రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌ రూపొందింది. త్వరలోనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా హీరో రానా 'రానా నాయుడు' వెబ్‌ సిరీస్ సీజన్‌ 2 పై క్లారిటీ ఇచ్చాడు. సీక్వెల్‌ కి సంబంధించిన ట్రైలర్‌ రెడీ అయిందని రానా తెలియజేశారు.

'రానా నాయుడు' సీజన్ 2 పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో త్వరలోనే స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రెడీ అయింది. అతి త్వరలోనే రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ సైతం ఇదే ఏడాదిలో ఉంటుందని రానా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెళ్లడి కానుంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఈ వెబ్‌ సిరీస్‌కి అభిమానులు ఉన్నారు. అందుకే సీజన్ 2 ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను నెట్‌ ఫ్లిక్స్‌ ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

రానా తాజాగా 'నువ్వు నాకు నచ్చావ్‌' సినిమా రీ రిలీజ్ పై స్పందించారు. వెంకటేష్ అభిమానులు చాలా రోజులుగా నువ్వు నాకు నచ్చావ్‌ సినిమా రీ రిలీజ్ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. కనుక త్వరలోనే రీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమా యూనిట్‌ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో ఒక ప్రత్యేక సందర్భం చూసి నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాను రీ రిలీజ్ చేస్తామని రానా అన్నాడు. సినిమాకు మంచి స్పందన వస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

కృష్ణ అండ్‌ హిజ్ లీలా సినిమాను అప్పుడు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేశారు. ఇప్పుడు థియేట్రికల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 'ఇట్స్ కాంప్లికేటెడ్‌' అనే టైటిల్‌తో ఈ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రానా సమర్పిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా రానా మాట్లాడుతూ రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌తో పాటు నువ్వు నాకు నచ్చావ్‌ సినిమా రీ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మరో వైపు ఆయన తన సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయన నటిస్తున్న సినిమా మాత్రం సెట్స్‌ పైకి వెళ్లలేదు.

Tags:    

Similar News