దూరంగా ఉంటే వరుణ్ తేజ్ దగ్గరకు రమ్మనేవాడు!
ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రచారం లో భాగంగా ఆన్ సెట్స్ అనుభవాలు పంచుకుంది
'ఏజెంట్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సాక్షివైద్య సుపరిచితమే. అమ్మడికి తొలి సినిమానే గట్టి షాక్ ఇచ్చింది. అయినా సాక్షి వెంట లక్ అనే ప్యాక్టర్ ఉంది. అందుకే ఫెయిలైన అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మూడు..నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి వరుణ్ తేజ్ సరసన నటిస్తోన్న 'గాండీవధారి అర్జున'. ఈసినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. హిట్ అందుకుని ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలకు ఊపు తేవాలని భావిస్తోంది. మరి ఎలాంటి హిట్ నమోదు చేస్తుందో చూడాలి.
ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రచారం లో భాగంగా ఆన్ సెట్స్ అనుభవాలు పంచుకుంది. వరుణ్ తేజ్ తో నటించాలంటే అమ్మడు తొలిసారి భయపడిందిట. పెద్దింటి హీరో ఎలా? అనే భావనలోకి వెళ్లిపోయిందిట. భయం కూడా వేసిందిట. దీంతో వరుణ్ తేజ్ తో ఎక్కువగా మాట్లాడేది కాదుట. మిగతా వారి పట్ల అలాగే ఉండేదిట. భాష కూడా రాకపోవడంతో చుట్టూ ఉన్న వారితో మాట్లాడా లంటే ఇబ్బదిగా అనిపించేదట. అంతా ఓ గ్యాగ్ లా కూర్చుని మాట్లాడుకుంటే తాను మాత్రం వాళ్లకు దూరంగా వెళ్లిపోయి ఒంటరిగా కూర్చునేదట.
ఈ విషయాన్ని వరుణ్ తేజ్ గమనించాడుట. అలా దూరంగా వెళ్లిపోతే ఎలా. నలుగురితో కలవాలి. వాళ్లతో కలిసి కూర్చోవాలి. అప్పుడే భాష అర్ధం అవుతుంది అనేవాడుట. అలా వరుణ్ లీడ్ తీసుకోవడంతో చిన్నగా భయం తొలగిపోయిందిట. చిత్రీకరణ సమయంలోనూ ఎంతో సహకరించాడుట. వరుణ్ అలా అనకపోయి ఉంటే ఒంటరిగానే షూటింగ్ ముగించాల్సి వచ్చేదని నవ్వేసింది.
తెలుగిప్పుడు కొంచెం కొంచె మాట్లాడుతుందిట. పెద్ద వాక్యాలు అర్దం కావంటొంది. కానీ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందిట. సినిమాకి సంతక చేసే ముందే ఈ విషయంముందే నిర్మాతలకు చెప్పిందిట. ఇక్కడి ఆడియన్స్ అమ్మడిని బాగా ప్రేమిస్తున్నారుట. భాషని నేర్చుకుని ఆ ప్రేమని తిరిగి ఇస్తానంటోంది. ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుందిట. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూస్తూ భాష నేర్చుకుంటుందట. హీరోలందరికంటే బన్నీ అంటే ఎక్కువ ఇష్టమట.