ఆయన ధైర్యంతోనే అలాంటి సీన్ చేశా..!

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Update: 2024-02-04 14:34 GMT

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లవ్ స్టోరీగా మొదలైన బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీగా టర్న్ తీసుకుని ఎమోషనల్ ఎండ్ తో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా చూసిన వారంతా కూడా సినిమాలో సుహాస్ సిస్టర్ గా చేసిన శరణ్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఫిదా సినిమాతో పాపులర్ అయిన శరణ్య అప్పటి నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

అయితే ఎలాంటి నటుడికైనా.. నటికైనా తమని తాము ప్రూవ్ చేసుకునే పాత్ర వచ్చినప్పుడే అసలు టాలెంట్ బయటకు వస్తుంది. అయితే ఆ టైం లో వారు తీసుకునే రిస్క్ ని బట్టి పాపులారిటీ కూడా వస్తుంది. ఈ క్రమంలో అంబాజీపేట సినిమాలో శరణ్య పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాలో ఒక సీన్ లో న్యూ**డ్ గా కనిపించింది. అయితే సినిమాలో కీలకమైన ఈ సీజ్ గురించి డైరెక్టర్ చెప్పగానే భయం వేసిందని శరణ్య రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు

అంతేకాదు ఆ సీన్ గురించి భర్త ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్పారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఆ సీన్ చేశానని.. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ధైర్యంగా నటించమని ఆయన చెప్పారు. ఆ సీన్ చేసే టైం లో ఐదుగురు మాత్రమే సెట్ లో ఉన్నారని చెప్పారు శరణ్య. ఫిదాలో సిస్టర్ పాత్రలో చేసిన శరణ్య ఆ సినిమా నుంచి చాలా సినిమాల్లో నటిస్తున్నా అంబాజీపేటలో అద్భుతమైన పాత్రలో నటించింది.

కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత శరణ్యకి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. దుశ్యంత్ కటికనేని డైరెక్షన్ లో తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాను జిఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని డైరెక్ట్ చేశారు. సినిమాలో సుహాస్ కు జంటగా శివాని నటించింది. సుహాస్ నటించిన కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎమోషనల్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్న సుహాస్ అందుకు తగినట్టుగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తన ఇమేజ్ కి తగినట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్న కథలు ఆకట్టుకుంటున్నాయి. లో బడ్జెట్ తో సుహాస్ చేస్తున్న సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుండటంతో సుహాస్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News