భర్త బ్రేకప్ విషయాన్ని చెప్పిన స్నేహ!
తాజాగా జీవిత ప్రయాణానికి సంబంధించి స్నేహ కొన్ని విలువైన విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే... 'పొజెసివ్ నెస్ ఉండాలి.
వివాహం తర్వాత స్నేహ సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఇదే తరహాలో బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. భర్త..పిల్లలు కుటుంబం అంటూ ఆ జీవితానికే ఎక్కువ ప్రాధన్యత ఇస్తుంది. హీరోయిన్ గా పనిచేసినంత కాలం చేసాను...ఇప్పుడు రిలాక్స్ అవ్వాల్సిన సమయం వచ్చింది అందుకే కూల్గా సినిమాలు చేస్తున్నట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇటీవలే చీరల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆబి జినెస్ ని సక్సెస్ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నటిగా తనకున్న ఇమేజ్ ని బిజినెస్ పరంగా వినియోగించుకుంటుంది.
తాజాగా జీవిత ప్రయాణానికి సంబంధించి స్నేహ కొన్ని విలువైన విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే... 'పొజెసివ్ నెస్ ఉండాలి. కానీ అది అతిగా ఉండకూడదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని కోల్పోతాం. బయటకు ఎందుకు వెళ్తున్నావ్? వెళ్లి ఏం చేస్తావ్? వంటి ప్రశ్నలు తలెత్తకూడదు. అవతలి వాళ్లు సరిగ్గా అర్దం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. లేకపోతే అన్నీ సమస్యలే. మనల్ని అడగక ముందే ఏం చేయబోతున్నామనేది ముందుగానే చెప్పేస్తే ఎలాంటి ఇబ్బందులండవు.
దాన్ని ఎవరైనా బాద్యతగా భావించాలి. వెళ్లాక సమయం ఉంటే భాగస్వామికి ఫోన్ చేసి చేరుకున్నావా? లేదా? భోజనం చేసావా? లాంటి విషయాలు అడగాలి. ఇలాంటివే ప్రేమను..నమ్మకాన్ని పెంచుతాయి.
పెళ్లైన కొత్తలో నేను కూడా పొజెసివ్ గా ఉండేదాన్ని. అలా అని నమ్మకం లేక కాదు. నాకంటే ముందు ఓ అమ్మాయిని ప్రసన్న ప్రేమించాడు. వారికి బ్రేకప్ అయింది. అందువల్ల నాకెలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరిగింది కాబట్టే ప్రసన్ననాకు భర్త అయ్యాడు.
లేకపోతే అలా జరిగేది కాదు. ఆ విషయంలో నేను లక్కీగా భావిస్తాను. అదే సమయంలో నాకు మరో సమస్య వచ్చి పడింది. ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. కానీ అప్పుడే తమిళనాడు ఫిలిం అవార్డు అందుకున్నాను. దీంతో ఆ ఒత్తిడి నుంచి బయటపడగలిగాను' అని అన్నారు. ఇటీవలి కాలంలో విడాకుల కేసులు ఎక్కువవుతోన్న నేపథ్యంలో స్నేహ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ లోనూ నిపుణులు ఇవే విషయాలు చెబుతున్నారు.