తమన్నా నీకు తమిళ తంబీలు నచ్చలేదా?
ఓ సారీ ఆ మ్యాటర్ లోకి వెళ్తే.. చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తమన్నా పాల్గొన్నారు
తమన్నా-విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. సినిమాల ద్వారానే వాళ్ల రొమాంటిక్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది చాటి చెబుతున్నారు. ఈ రిలేషన్ షిప్ పెళ్లి వరకూ వెళ్తుందా? లేదా? అన్నది పక్కన బెడితే! తాజాగా తమన్నా పై ఓ నెటి జనుడు కక్షగట్టి నట్లు ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దీనికి ఒకింత తమన్నా అసహానానికి గురైంది. ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్దం కాలేదు.
ఓ సారీ ఆ మ్యాటర్ లోకి వెళ్తే.. చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తమన్నా పాల్గొన్నారు. నెగిటివిటీని మీరు ఎలా ఎదుర్కుంటారని ఒకరు అడగగా.. వ్యతిరేకతలు..విమర్శలు వచ్చినప్పుడు ఎందుకిలా జరిగిందని ఆలోచాస్తాం. కొంత మంది ప్రశ్నిస్తారు. మరికొంత మంది విమర్శిస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి చింతించాల్సిన పనిలేదు. వ్యతిరేకతను ఎక్కువగా తలెక్కించుకోవాల్సిన పనిలేదు.
అనంతరం మరో నెటి జనుడు ముందుకొచ్చి మీకు తమిళ నాడుకి చెందిన అబ్బాయిలు నచ్చలేదా? అని డైరెక్ట్ గా అడిగేసాడు. దీంతో తమన్నా అసహానానికి లోనైంది. నన్ను కన్నా నా తల్లిదండ్రులే నన్ను ఎప్పుడూ ఇలా అడగలేదు. మీరు ఎంటడి బాబు ఇలా ఎటాక్ చేసారంటూ బధులిచ్చింది. సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయితే హీరోయిన్లకు ఇలాంటి ప్రశ్నలు తప్పవు.
వీటిని కొంత మంది పాజిటివ్ తీసుకుని సమాధానం చెప్పాలనిపిస్తే చెబుతారు. లేదంటే సైలెంట్ గా ఉంటారు. కాస్త అసహనానికి గురయ్యే నటి అయితే అంతే ధీటుగా సమాధానం ఇస్తుంటుంది. ఇక తమన్నా కెరీర్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన 'జైలర్' లో 'కావలయ్యా' అంటూ హాట్ ఐంటం నెంబర్లో నటించి కుర్రకారుని ఊపేసింది.