లక్ష్యం కోసం వాణీకపూర్ తలదించుకున్న సందర్బాలెన్నో!
బాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటీమణుల్లో వాణీ కపూర్ ఒకరు. కపూర్ వంశస్తురా లిగా ఎంట్రీ ఇచ్చినా! తనకు తానుగానే పైకెదిగింది
బాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటీమణుల్లో వాణీ కపూర్ ఒకరు. కపూర్ వంశస్తురా లిగా ఎంట్రీ ఇచ్చినా! తనకు తానుగానే పైకెదిగింది. 18-19 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంది. ఒకానొక సమయంలో కుటుంబానికి అండగా నిలబడింది. కుటుంబం బాధ్యతలు నెత్తిన వేసుకుని సింగిల్ గానే ఆ బారాన్ని మోసింది. ఇలా ఓ వైపు కుటుంబం ఇన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నా! తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
ఓవైపు కుటుంబాన్నిచూసుకుంటూనే సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. అయితే నటిగా ఎదిగే క్రమంలోనే ఎన్నో అవమానాలు ...తిరస్కరణలకు గురైంది. అన్నింటిని తట్టుకుని నేడు మార్కెట్ లో నిలబడగలగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'సాధించిన విజయాలు..ఎదుర్కున్న సవాళ్లు.. చవిచూసిన పరాజయాలు వెనుక నాలోని బిడియం..పిరికితనం బావాలు నాలోని బయటపెట్టలేని మరో కోణం.
ఒక మంచి షాట్ కోసం గంటలు తరబడి పోల్ డాన్సులు చేయడం.. రోజు 8 గంటల పాటు టాంగో హిప్ హాప్ నేర్చుకోవడం... ఇవన్నీ ఒక మంచి పాత్ర చేసిన తర్వాత..ఒక పల్లెటూరి అమ్మాయిగా లేదా ఆడంబరమైన ట్రాన్స్ గర్ల్ గా నటించడం కోసమే. అలాంటి పాత్రలు చేయడానికి ఎన్నైళ్లైనా పట్టొచ్చు. ఓపికగా ఎదురు చూడాలంతే. నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. కొన్నింటిలో ఆడిషన్ ఇవ్వక ముందే తిరస్కరణకు గురయ్యాను. వాటికి కారణం నా మనసులో భావాలు సరిగ్గా బయట పెట్టకపోవడం వలనే అనుకుంటున్నాను.
కలలను నేర్చుకోవడం కోసం తలదించుకుని కష్టపడే తత్వమే నా జయాపజయాలకు కారణంగా భావిస్తా ను. ఈ స్థాయిలో ఉన్నాను అంటే దీని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు.. అవమానాలు.ఆందోళనలు చాలా నే ఉన్నాయి. జీవితం చాలా పాఠాలే నేర్పింది' అంది. వాణీ కపూర్ 'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. బాలీవుడ్ లో 'శుద్ దేశీ రొమాన్స్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై 'బేఫ్ క్రే'..'వార్' లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది.