నటికి అరుదైన వ్యాధి..వాష్ రూమ్ కి వెళ్లాలంటే!
ఇటీవలి కాలంలో హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతోన్న అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతోన్న అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ తో బాధపడుతోన్న విషయాన్ని ఏమాత్రం దాచకుండా పబ్లిక్ చేసింది. చికిత్స పొందుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి విషయం బహిర్గతం చేసింది. దీంతో చాలా మంది నటీమణుల్లో సమంత కావాల్సినంత ధైర్యాన్ని నింపినట్లు అయింది.
తమ ఆరోగ్య సమస్యల్ని సైతం పలువురు నటీమణులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రియా బాజ్ పాయ్.. కల్పికా గణేష్ లాంటి వారు కూడా మయోసైటిస్ తో బాధపడుతున్నవారే. అలాగే నందిత శ్వేత కూడా ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వస్తే శరీరంలో ఎలా ఉంటుందో వెల్లడించింది. వీళ్లందర్నీ స్పూర్తిగా తీసుకుని యూ ట్యూబర్లు...రీల్స్ చేసే గ్యాంగ్ లు కూడా తమకున్న జబ్బులు గురించి పబ్లిక్ చేసారు.
తాజాగా మరో నటి వనితా విజయ్ కుమార్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధితో కొంత కాలంగా బాధపడుతుందిట. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే? చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండాలంటే భయమేస్తుందిట. అంటే లిప్ట్..వాష్ రూమ్..కిటీకి లు లేని ఇళ్లు లో ఎక్కువ సేపు ఉంటే ఆందోళనగా ఉంటుందిట. జనసమూహాల్లో ఉంటే ఊపిరి సరిగ్గా ఆడని భావన కల్గుతుందిట. గతంలో ఇదే వ్యాధితో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా బాధపడినట్లు తెలుస్తోంది.
`బిగ్ బాస్` సెట్లోకి వెళ్లిన అనంతరం అక్కడ ఉండలేక బయటకు వచ్చేసిన అనంతరం ఈ సంగతి బయట పడింది. ఇక వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ మూడవ సీజన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. టీవీ..వెండి తెర రెండిటా రాణిస్తోంది. అలాగే ఆమె కుమార్తె జోవిక కూడా సినిమాల్లో నటించేదుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని హాట్ ఫోటోలు కూడా నెట్టింట షేర్ చేసింది. ఈ భామ అనుపమ్ ఖేర్ ఇనిస్ట్యూట్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది.