డ్రగ్స్ కేసు : ఆదిలింగం ఎవరో చెప్పిన వరలక్ష్మి
2020లో కేరళ లోని విల్లించాం తీర ప్రాంతంలో 300 కేజీల డ్రగ్స్ మరియు ఏకే 47 ఇంకా బుల్లెట్స్ ను రక్షక దళం స్వాధీనం చేసుకోవడం జరిగింది
సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఐ ఏ నోటీసులు ఇచ్చిందని, విచారణకు హాజరు అవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగిందని తమిళ్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. వార్తలను వరలక్ష్మి శరత్ కుమార్ ఖండించింది. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆమె స్పష్టం చేసింది.
అంతే కాకుండా ఆదిలింగం విషయంలో కూడా ఆమె స్పందించింది. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిలింగం గతంలో తన వద్ద ఫ్రీలాన్స్ మేనేజర్ గా చేశాడని వరలక్ష్మి శరత్ కుమార్ ఒప్పుకున్నారు. అయితే మూడు సంవత్సరాల నుండి అతడితో తనకు ఎలాంటి డీలింగ్స్ లేవని పేర్కొంది. మూడు ఏళ్ల క్రితమే అతడిని మేనేజర్ గా తొలగించినట్లుగా పేర్కొంది.
ఆదిలింగం సరిగ్గా వరలక్ష్మి శరత్ కుమార్ వద్ద మేనేజర్ గా చేస్తున్న సమయంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అందుకే ప్రస్తుతం విచారణ లో ఆమె పేరు కూడా వినిపిస్తుంది. ఎన్ ఐ ఏ అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్ ను అందుకే విచారించే ఉద్దేశ్యంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆమెకు నోటీసులు అయితే వెళ్లలేదని క్లారిటీ వచ్చింది.
2020లో కేరళ లోని విల్లించాం తీర ప్రాంతంలో 300 కేజీల డ్రగ్స్ మరియు ఏకే 47 ఇంకా బుల్లెట్స్ ను రక్షక దళం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా 14వ వ్యక్తి అయిన ఆదిలింగం ను ఎన్ ఐ ఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డ్రగ్స్ మరియు ఏకే 47 పట్టుబడ్డ సమయంలో ఆదిలింగం వరలక్ష్మి వద్ద మేనేజర్ గా చేస్తున్న కారణంగా ఈ కేసు తో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్ ఐ ఏ అధికారులు విచారిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అంతే తప్ప ఆమెకు ఎలాంటి నోటీసు వెళ్లలేదు.
ముందు ముందు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. ఆదిలింగం కు ఇండస్ట్రీకి మరియు రాజకీయాలకు చెందిన వారితో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. కనుక ముందు ముందు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అంటూ తమిళ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.