ఆదిపురుష్‌తో చంద్రయాన్ 3.. ఇదెక్కడి పోలిక బాబు?
సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ట్రోలింగ్-ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది
సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ట్రోలింగ్-ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని ఇంకో అంశంతో ముడిపెడుతూ దాన్ని తెగ షికార్లు కొట్టిస్తుంటారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం టెలివిజన్ మీడియా-సోషల్‌మీడియాలో ట్రెండింగ్ విషయం చంద్రయాన్-3 అన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన ఇస్రో గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే ఈ చంద్రయాన్ 3 బడ్జెట్ ఖర్చు కడా చర్చనీయాశంగా మారింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం రూ.615 కోట్ల బడ్జెటుతో చంద్రయాన్-3 కలను సాకారం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో కొంటమంది ట్రోలర్స్.. ప్రభాస్ ఆదిపురుష్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రయాన్ 3 బడ్జెట్‌ను ఆదిపురుష్ బడ్జెట్‌తో పోలుస్తూ ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు.
దాదాపు రూ.600-700కోట్లకు(మార్కెట్ వర్గాల సమాచారం)పైగా బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్.. పేలవ విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ డిజాస్టర్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో విమర్శలను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు అలాంటి అనవసరమైన సినిమాలకు అంత ఖర్చు పెట్టడం కన్నా చంద్రయాన్ లాంటి వాటికి ఆ డబ్బులిస్తే ప్రగతికి ఉపయోగపడుతుందని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.
రామాయణానికి మచ్చ తెచ్చే సినిమాల కన్నా సైన్స్ ఎక్స్ పెరిమెంట్లు నయమని అంటున్నారు. ఆదిపురుష్ కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర లిఖించారని, భారత జెండాను వినువీధుల్లో సగర్వంగా ఎగురవేశారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఈ రెండిటినీ పోల్చడం సరికాదంటూ మరికొందరు అంటున్నారు.
ఇకపోతే చంద్రయాన్ 3 బడ్డెట్... హాలీవుడ్ బడా చిత్రాల నిర్మాణవ్యయం కన్నా తక్కువని తెలిసింది. 'బార్బీ' (145 మిలియన్ డాలర్లు/రూ.1,197 కోట్లు),దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ 'ఓపెన్‌హైమర్'(100 మిలియన్ డాలర్లు/రూ.825 కోట్లు)ల బడ్జెట్. క్రిస్టఫర్ నోలన్ పదేళ్ల కిందట అంతరిక్ష నేపథ్యంలో 'ఇంటర్‌స్టెల్లార్' పేరుతో తెరకెక్కించిన చిత్ర నిర్మాణ వ్యయం ఏకంగా 165 మిలియన్ డాలర్లు(రూ.1,362 కోట్లు). 2015లో అంతరిక్ష జర్నీ కాన్సెప్ట్‌తో వచ్చిన ది మాషన్ బడ్జెట్ కూడా 106 మిలియన్ డాలర్లు (రూ.875 కోట్లు).