భర్తను 'మేనికార్న్' అంది.. అలా అనొచ్చా అదితీ?
మహాసముద్రం సెట్స్‌లో కలుసుకున్న తర్వాత ప్రేమలో పడిన ఈ జంట, కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉంది. ఎట్టకేలకు పెళ్లితో ఒకటైంది.
అదితి రావ్ హైదరీ - సిద్ధార్థ్ జంట ప్రేమాయణం, పెళ్లి వ్యవహారం తెలిసినవే. తెలంగాణలోని 400 ఏళ్ల నాటి గుడిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినీసెలబ్రిటీలు సహా అభిమానులు ఈ జంటను ఆశీర్వదించారు. మహాసముద్రం సెట్స్‌లో కలుసుకున్న తర్వాత ప్రేమలో పడిన ఈ జంట, కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉంది. ఎట్టకేలకు పెళ్లితో ఒకటైంది.
ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటవుతోంది. వారు ఒకరిని మించి ఒకరు చిలిపి. ఇద్దరి మధ్యా సరసం ఒక రేంజులో కనెక్టవుతోంది. ఇప్పుడు అదితీ తన సఖుడిని `మేనికార్న్` అని కామెంట్ చేయడం చర్చగా మారింది. అదితీ తన భర్తను ఆ పేరుతో ఎందుకు పిలుస్తుందో తెలుసా? అయితే ఈ ముద్దుపేరు `మేనికార్న్` ఎలా పుట్టిందో కారణం వెతికితే.. గలాట్టా ఇండియాతో త్రోబాక్ ఇంటర్వ్యూలో అదితీ అసలు విషయం చెప్పింది.
నాతో హీరామండికి పని చేసిన నా మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరైన తనూజా డబీర్ నన్ను `యునికార్న్` అని పిలుస్తుంది. కాబట్టి ఆమె జూనికార్న్ అని చెప్పింది. ఆమె సిద్ధు (సిద్ధార్థ్)ని కలిసినప్పుడు `ఓహ్ మై గాడ్ యునికార్న్` మీరు మీ `మేనికార్న్`ని కనుగొన్నారు అని అంది. అందుకే అతడిని అలా పిలుస్తాను`` అని అదితీ అసలు కథ చెప్పింది.
అదితి రావ్ హైదరి తన భర్త సిద్ధార్థ్‌కు ఇదివరకూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు మొదటిసారిగా మానికార్న్ అని వ్యాఖ్యానించింది. ``హ్యాపీయెస్ట్ బర్త్ డే నా మేనికార్న్, అంతులేని నవ్వు.. అద్భుత ఆనందానికి, శక్తికి నిర్వచనం.. అంటూ రాసింది. అదితి తాను సిద్ధార్థ్ కి `ఎప్పటికీ ఛీర్‌లీడర్` అని కూడా అంది.