సౌత్ సినిమాలపై వెటకారం… ఇచ్చిపడేసిన అడివి శేష్
ట్విట్టర్ లో ది బ్యాడ్ డాక్టర్ అనే హ్యాండిల్ నుంచి సౌత్ సినిమాలపై వ్యంగ్యంగా ఒక పోస్ట్ వచ్చింది.
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ పైన సౌత్ సినిమా ఆధిపత్యం నడుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం హిట్స్ అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. దర్శకులు కూడా ఒకేరకమైన కథలు చేస్తున్నారు. దీంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ సైతం సౌత్ సినిమాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన సినిమాలకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి సినిమాతో రాజమౌళి క్రియేట్ చేసిన మార్క్ ని సౌత్ లో చాలా మంది దర్శకులు కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది రిలీజ్ అయిన ‘హనుమాన్’, ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’, ‘అమరన్’ సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. అయితే నార్త్ ఇండియాలో చాలా మంది మన సౌత్ సినిమాల ఆధిపత్యాన్ని సహించలేరు. ఏదో ఒక రూపంలో సౌత్ సినిమాలు, హీరోలు, దర్శకులపై తమ విద్వేషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ సౌత్ సినిమాలపై వారికున్న చులకన భావాన్ని చూపిస్తూ ఉంటారు.
ట్విట్టర్ లో ది బ్యాడ్ డాక్టర్ అనే హ్యాండిల్ నుంచి సౌత్ సినిమాలపై వ్యంగ్యంగా ఒక పోస్ట్ వచ్చింది. దక్షిణాది చిత్రాలలో ఫార్ములా ఏంటంటే శుచీ శుభ్రత లేని వ్యక్తి ఆత్మనూన్యతతో బాధపడుతూ ప్రేమించిన అమ్మాయి కోసం పది వేల మంది మల్లయోధులను మట్టి కరిపిస్తాడు. ఇదంతా దేనికంటే స్వంత తెలివి లేని అందమైన ప్రియురాలిని మెప్పించేందుకు అంట అని ట్వీట్ బ్యాడ్ డాక్టర్ రాసుకొచ్చాడు. ‘పుష్ప 2’ సినిమాపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొని ఉంది. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీనుకొస్తున్న హైప్ ని చూసి తట్టుకోలేక అతను ఈ ట్వీట్ చేసాడనే మాట వినిపిస్తోంది.
దీనిపై అడివి శేష్ స్పందిస్తూ ఇలాంటి వివక్షాపూరితమైన కామెంట్స్ చేసే బదులు అమెరికా, జపాన్ లలో సౌత్ సినిమాలకి వస్తోన్న ఆదరణ చూసి తెలుసుకోండి అంటూ సున్నితంగా కౌంటర్ వేశారు. ఇక ఆ బ్యాడ్ డాక్టర్ కామెంట్స్ నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసే ముందు నార్త్ ఇండియాలో తెరకెక్కుతోన్న సినిమాలు గురించి ఆలోచించుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పరుషంగా విమర్శలు చేస్తున్నారు.
సౌత్ సినిమాలకి నార్త్ ఇండియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తోన్న తరుణంగా వాటిని తట్టుకోలేని వారు ఇలా విషం కక్కుతూ ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యూఎస్, జపాన్, చైనా దేశాలలో కూడా సౌత్ సినిమాలకి అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. అలాగే నార్త్ ప్రేక్షకులు కూడా బాలీవుడ్ చిత్రాలు పక్కన పెట్టి సౌత్ సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కొందరికి అస్సలు మింగుడుపడటం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.