తప్పలేదు... పేరు మార్చుకోవాల్సి వచ్చింది!
అయితే అప్పటికే పాపులరైన శృంగార నటి సన్నీ లియోన్ పేరుతో సమానంగా సౌండింగ్ ఉండటంతో తనని అలా పిలుస్తూ స్నేహితులు ఆటపట్టించేవారట.
మేజర్-గూడాచారి లాంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఆవిర్భవించాడు అడివి శేష్. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ తర్వాత యువహీరోల్లో శేష్ పేరు పాన్ ఇండియా రేసులో వినిపించడం ఆషామాషీ కాదు. అయితే అసలు తన పేరు శేష్ కాదు అనేది ఎందరికి తెలుసు?
అతడు తన పేరును స్కూల్ డేస్ లోనే మార్చుకున్నాడు. అమెరికాలో చదువుకున్న శేష్ పేరు రిజిస్టర్‌లో అడివి సన్నీ చంద్ర అని ఉండేది. అయితే అప్పటికే పాపులరైన శృంగార నటి సన్నీ లియోన్ పేరుతో సమానంగా సౌండింగ్ ఉండటంతో తనని అలా పిలుస్తూ స్నేహితులు ఆటపట్టించేవారట. ''నన్ను 'సన్నీ లియోన్' అని పిలిచేవారు.. కేవలం ఒకేలా పేర్లు ఉన్నందున..'' అని శేష్ వెల్లడించాడు. దాంతో తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు.
అడివి శేష్ కర్మ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ కం హీరోగా అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంగేట్రమే ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు. పవన్ కల్యాణ్ పంజాలోను నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత సోలో హీరోగా తనను తాను మలుచుకున్న తీరు, నేడు పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిర్భవించేందుకు చేసిన హార్డ్ వర్క్‌ని అస్సలు మర్చిపోలేం. అయితే సన్నీలియోన్ అనే పిలుపు తనను ఇబ్బంది పెడుతోంది గనుక తన పేరును మార్చుకున్నాడు. ఈ మార్పు నిజంగానే అతడికి కలిసొచ్చిందని చెప్పాలి. సన్నీ చంద్ర అలియాస్ అడివి శేష్ ఇప్పుడు ఏల్తున్నాడు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా సన్నీలియోన్ గురించి యువతరానికి బాగా తెలుసు. అప్పట్లో అమెరికాలో సన్నీ డిలైట్ అనే ఆరెంజ్ డ్రింక్ ఉండేదట. దానివల్ల కూడా పేరు మార్చుకుంటే మంచిదని శేష్ భావించాడని కూడా తెలుస్తోంది.
గజదొంగగా శేష్
శేష్ నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్'పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోంది. ఇది ఇద్దరు మాజీ దొంగలు అయిన ప్రేమ జంట చుట్టూ తిరిగే కథాంశం. సాహసోపేతమైన దోపిడీల కోసం బలవంతంగా ఆ ఇద్దరినీ కలుపుతారట. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూపిస్తున్నారు. శేష్, శ్రుతి హాసన్ ఈ చిత్రంలో గజదొంగలుగా కనిపించనున్నారు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డియో - శేష్ జోడీ కథ - స్క్రీన్ ప్లేను రూపొందించారు. నిశ్శబ్ద భారతదేశంలోని సుదూరంగా ఉన్న ప్రాంతాలు.. అక్కడ గ్రామాలు.. పట్టణాలలో తిరిగే పాత్రలతో సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని శేష్ చెప్పారు.
డెకాయిట్‌ను సుప్రియ యార్లగడ్డ -సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. హిందీ- తెలుగులో ఏకకాలంలో తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు.