అప్పుడు బాహుబలి.. ఇప్పుడు కల్కి..!

కానీ ఇండస్ట్రీ ఫేట్ మార్చే సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్ సినిమా అంటే మాత్రం అది పరిశ్రమ సొంతంగా భావిస్తుంది.

Update: 2024-06-23 05:49 GMT

ఒక స్టార్ హీరో సినిమా మన పరిశ్రమ స్థాయిని పెంచుతుంది అంటే కచ్చితంగా ఆ సినిమాను పరిశ్రమ మొత్తం ఏకమై ప్రమోట్ చేస్తుంది. అలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఆ హీరోని అతని కథల ఎంపికను ప్రశంసిస్తుంది. ఐతే మిగతా హీరోల సినిమాలకు ఇలా జరగదు. అందరు స్టార్ హీరోల సినిమాలు కాంపిటీషన్ గా చూసే పరిశ్రమ ఒక స్టార్ హీరో సినిమాని మాత్రం పరిశ్రమ ఓన్ చేసుకుంటుంది. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ అన్నది ఇప్పుడు చూద్దాం.

మాములుగా ఒక స్టార్ హీరో సినిమా అంటే అన్ని సినిమాలతో పాటు అది కూడా అన్నట్టు ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఫేట్ మార్చే సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్ సినిమా అంటే మాత్రం అది పరిశ్రమ సొంతంగా భావిస్తుంది. అలా ఓన్ చేసుకోవడానికి కారణం ప్రభాస్ ఎంపిక చేసుకుంటున్న కథలే. అంతకుముందు ప్రభాస్ ఒక ప్రాంతీయ హీరో మాత్రమే బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

బాహుబలి సినిమా టైం లో కూడా అంతే.. రాజమౌళితో ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా మొదటిసారి ఒక ప్రాజెక్ట్ ని రెండు ముక్కలుగా చేసి రిలీజ్ చేశారు. అలా సినిమాపై భారీ హైప్ రాగా ఇదేదో తెలుగు పరిశ్రమ మొత్తానికి పేరు తెచ్చేలా ఉందని సినిమా గురించి మన పర అనే బేధం లేకుండా టాలీవుడ్ మొత్తం ఏకమై బాహుబలి గురించి మాట్లాడింది.

అనుకున్నట్టుగానే బాహుబలి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఆఫ్టర్ బాహుబలి మళ్లీ కల్కి సినిమాకు కూడా అదే సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి కనబడుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసి మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా ప్రభాస్ చేస్తున్నాడని గుర్తించి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది.

ప్రభాస్ ఒక్కడికే ఇలా జరుగుతుంది ఎందుకని కొందరికి ఆలోచన ఉన్నా పరిశ్రమ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు చేస్తున్నాడు కాబట్టే ఈ సపోర్ట్ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కల్కి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం బాహుబలి రికార్డులు సైతం బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో హేమాహేమీలందరు నటించి ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ ని డబుల్ చేశారు. ఇక రిలీజైన రెండు ట్రైలర్స్ చూస్తే కల్కి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని ఫిక్స్ అయ్యారు.

Tags:    

Similar News