జూన్ టూ డిసెంబర్ మధ్య జాతరేనా!
వేసవిని స్టార్ హీరోలంతా లైట్ తీసుకుంటారు. పండగ రిలీజ్ కి ఇచ్చిన ప్రాధాన్యత వేసవి సెలవులుక ఇవ్వరు.
వేసవిని స్టార్ హీరోలంతా లైట్ తీసుకుంటారు. పండగ రిలీజ్ కి ఇచ్చిన ప్రాధాన్యత వేసవి సెలవులుక ఇవ్వరు. రాను రాను ఈ ఒరవడి మరింత పెరుగుతుంది. చిన్న సినిమాలు సైతం పండగ ముందు... లేదా తర్వాత అటు ఇటుగా రిలీజ్ చేస్తున్నారు తప్ప....విద్యార్ధులకు సెలవులైన సమ్మర్ ని మాత్రం వాళ్లు టార్గెట్ చేయడం లేదు. ఈ ఏడాది మే లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హడావుడి కనిపిస్తుందని భావించారు గానీ చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేసారు. అయితే జూన్ నుంచి మాత్రం వరుసగా అగ్ర హీరోలంతా క్యూలో కనిపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే రిలీజ్ కి రెడీ అవుతున్నారు.
జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఇదే జాతర షురూ అవుతుంది. `కల్కీ 2898`ని జూన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక అదే నెలలో విశ్వ నటుడు కమలహాసన్ నటిస్తోన్న `భారతీయుడు-2` కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ముందే రిలీజ్ తేదీ ఫిక్స్ అయింది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య జూన్ లో తగ్గాప్ వార్ తప్పదు. `భారతీయుడు -2 `లో కమల్ లీడ్ రోల్ పోషిస్తుంటే... `కల్కీ`లో అదే కమల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే కమల్ ఇమేజ్ మరింత రెట్టింపు అవుతుంది. మలయాళం స్టార్ మమ్ముట్టి నటిస్తోన్న ` టర్బో` కూడా జూన్‌లో రిలీజ్ అవుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
అలాగే చియన్ విక్రమ్ నటిస్తోన్న ప్రయోగాత్మక చిత్రం `తంగలాన్` వీటన్నింటికంటే ముందే మేలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో విక్రమ్ బౌన్స్ బ్యాక్ అవుతాడనే అంచనాలున్నాయి. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద విక్రమ్ ఊచ కొత్త తప్పదు. ఇక మరో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న `లక్కీ బాస్కర్` జూలైలో విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఆగస్టు లో `పుష్ప-2` రాక దాదాపు ఖాయమైనట్లే. స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకుని ఈ సినిమా భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `ఓజీ` సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. పవన్ రాసి పెట్టుకోమని హింట్ కూడా పంపిచేసారు. ఎన్నికలు అనంతరం పీకే డైరెక్ట్ గా ఆ సినిమా సెట్స్ కే వెళ్తాడు. పీకే హడావుడి ముగిసిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైన్ లోకి వచ్చేస్తాడు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `దేవర` మొదటి భాగాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రజనీకాంత్ `వేట్టైయాన్` - అజిత్ కుమార్ నటిస్తోన్న `విడా ముయార్చి` కూడా అక్టోబర్‌లోనే రిలీజ్ అవుతున్నాయి.
ఇదే నెలలో మెగా పవర్ స్టార్ రామ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` కూడా రిలీజ్ ప్తాన్ చేస్తున్నారు. సూర్య పీరియాడికల్ డ్రామా `కంగువ` - ఎన్బీకే 109 చిత్రాలు కూడా అదే నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.