దిల్ రూబా.. స్టన్నింగ్ లుక్స్ లో కిరణ్ అబ్బవరం స్టైలిష్ సాంగ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "దిల్ రూబా" ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "దిల్ రూబా" ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిమ్ సమర్పణలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. "దిల్ రూబా" టీజర్ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్ కు వచ్చిన విశేష స్పందనతో ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసిన చిత్రబృందం తాజాగా "అగ్గిపుల్లె" పాటను విడుదల చేశారు. ఈ పాటను వినగానే హృదయాలను కదిలించే మెలొడీగా నిలిచింది.
ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ అందించిన ఈ గీతానికి భాస్కర భట్ల రాసిన హృదయాన్ని తాకే లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అగ్గిపుల్లే పాటలో ప్రేమలోని ఆవేశాన్ని, గాఢతను అద్భుతంగా వ్యక్తీకరించిన విధానం ప్రేక్షకులను అలరించింది. అనురాగ్ కులకర్ణి తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశారు. సాహిత్యం, సంగీతం, గానం ఇలా అన్ని కోణాలలోనూ ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా కిరణ్ స్టైలిష్ లుక్స్ లో చేసిన స్టెప్పులు అయితే చాలా బ్యూటీఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమా కలర్ఫుల్ గా ఉండబోతున్నట్లు ఈ ఒక్క పాట తోనే అర్ధమవుతుంది. అలాగే హీరోగా కిరణ్ క్యారెక్టర్ చాలా కొత్తగా స్టైలిష్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. "క" మూవీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యిన నేపథ్యంలో "దిల్ రూబా" పాటలు కూడా మంచి విజయాన్ని సాధిస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి ప్రత్యేకంగా స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటం మరో ఆకర్షణగా మారింది. సినిమాటోగ్రాఫర్ డానియెల్ విశ్వాస్ అందించిన విజువల్స్ సినిమాకు కొత్తదనాన్ని తెస్తున్నాయి. ఎడిటింగ్ బాధ్యతలను ప్రవీణ్ కేఎల్ చూసుకుంటున్నారు. ప్యాకేజింగ్, ప్రమోషన్ లో సినిమా యూనిట్ చూపిస్తున్న శ్రద్ధ "దిల్ రూబా" ను ప్రేక్షకుల హృదయాల్లో నిలుపుతుందని అంచనా.
సమర్పణలో సారెగమ ఇండియా లిమిటెడ్ నిర్మాణ సంస్థ "దిల్ రూబా" తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీ అప్‌డేట్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రేమకథకు మెలొడీ టచ్‌తో వచ్చిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతుండటం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద కిరణ్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.