రాజాసాబ్ : హిందీ వారికోసం రీమిక్స్ స్ట్రాటజీ
కల్కి సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్ లో మరోసారి జాయిన్ అయిన ప్రభాస్ తదుపరి సినిమా రాజాసాబ్ అనే విషయం తెల్సిందే.
ప్రభాస్ సినిమా అంటే చాలు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. అలాంటి ప్రభాస్ మూవీకి ఇంకాస్త అదనపు హంగులు కలిగించి, ప్రమోషనల్ స్ట్రాటజీస్ చక్కగా వినియోగిస్తే ఏ స్థాయిలో ఫలితం ఉంటుందో ఇప్పటికే విడుదల అయిన ప్రభాస్ సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి.
కల్కి సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్ లో మరోసారి జాయిన్ అయిన ప్రభాస్ తదుపరి సినిమా రాజాసాబ్ అనే విషయం తెల్సిందే. చిన్న చిత్రాల దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇన్నాళ్లు పాతిక కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాలను తీసిన మారుతి ఏకంగా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల బడ్జెట్ సినిమాను ప్రభాస్ తో తీస్తున్నాడు.
ఆయన చెప్పిన కాన్సెప్ట్ మరియు ఆయన తీయబోతున్న తీరుపై చాలా నమ్మకం ఉండటం వల్లే నిర్మాతలు ఆ స్థాయి బడ్జెట్ ను పెట్టబోతున్నారు. ఇక సినిమాను అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ చేసేందుకు గాను దర్శకుడు మారుతి ప్లాన్ చేస్తున్నాడు.
సినిమా కంటెంట్ తో పాటు, ఆ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు మంచి మార్కెటింగ్ మెలుకువ కావాల్సి ఉంటుంది. ఆ మార్కెటింగ్ మెలుకువలో భాగంగానే రాజాసాబ్ సినిమాలో ఒక హిందీ సూపర్ హిట్ క్లాసిక్ పాటను రీమిక్స్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
పాతిక ఏళ్ల క్రితం హిందీ ప్రేక్షకులతో పాటు, దేశం మొత్తం కూడా ఆ పాట తెగ ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఆ పాటను రాజా సాబ్ కోసం థమన్ రీమిక్స్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు.
రీమిక్స్ వార్త నిజం అయితే కచ్చితంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కల్కి తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మారుతి అంచనాలు అందుకునే విధంగా రాజాసాబ్ ను రెడీ చేస్తున్నాడట.