జీప్‌లో క్యూట్‌గా నాటీగా.. ఎవ‌రీ పిల్ల‌?

శ‌ర్మా సిస్ట‌ర్స్‌లో చిట్టి పొట్టి పాపాయి ఈ ఐషా శ‌ర్మ‌. సోద‌రి నేహాశ‌ర్మ‌తో క‌లిసి నిరంత‌రం మోడ‌లింగ్ లో దూసుకుపోతోంది.

Update: 2024-09-21 03:30 GMT

క్యూట్‌గా న‌వ్వుతూ నాటీగా వ‌లేస్తోంది.. ఎవ‌రీ బ్యూటీ?.. ర‌న్నింగ్ జీప్‌లో ఏంటా చిలిపి అల్ల‌రి? ఇంత‌కీ ఎవ‌రీమె? ఇలాంటి చాలా డౌట్లు పుట్టుకొస్తున్నాయి నెటిజ‌నుల‌కు. అయితే ఈ బ్యూటీ గురించి టూమ‌చ్ గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. శ‌ర్మా సిస్ట‌ర్స్‌లో చిట్టి పొట్టి పాపాయి ఈ ఐషా శ‌ర్మ‌. సోద‌రి నేహాశ‌ర్మ‌తో క‌లిసి నిరంత‌రం మోడ‌లింగ్ లో దూసుకుపోతోంది.

సోష‌ల్ మీడియా రెవెన్యూలో అక్కా చెల్లెళ్ల స్పీడ్ మామూలుగా లేదు. నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లను పోస్ట్ చేస్తూ భారీగానే ఆర్జిస్తున్నారు. ఇన్ స్టా మాధ్య‌మంలో నిరంత‌రం త‌మ లేటెస్ట్ అప్ డేట్ ల‌ను అందిస్తూ సిస్ట‌ర్స్ చాలా గేమ్ ఆడుతున్నారు. తాజాగా ఐషా శ‌ర్మ జీప్ న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతూ ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. అందంగా న‌వ్వుతూ నాటీగా క‌వ్విస్తూ ఐషా శ‌ర్మ త‌న క్లీ*జీ షోతో మ‌తులు చెడ‌గొడుతోంది. డ‌ఫెల్ ఫ్యాంట్, బ్లాక్ షోల్డ‌ర్ లెస్ టాప్ ధ‌రించి దుమారం రేపుతోంది. ఐషా స్మైలీ లుక్ ని మించి త‌న అందాల జాత‌ర యూత్‌ని క‌వ్విస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

బాలీవుడ్ లో ఆశించినంత ఉత్త‌మ‌మైన కెరీర్ ర‌న్ లేక‌పోయినా శ‌ర్మా సిస్ట‌ర్స్ త‌మ‌కంటూ ఎర్నింగ్ కోసం ర‌క‌ర‌కాల వ్యాప‌కాల‌తో బిజీగా ఉన్నారు. ఐషా శర్మ - నేహా శర్మ బీహార్ కి చెందిన ప్ర‌ముఖ‌ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలు. నేహాశ‌ర్మ‌ను రాజ‌కీయాల్లోకి లాగాల‌నేది అత‌డి ప్లాన్. గ‌త ఎన్నిక‌ల్లో స్థానికంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించినా కానీ నేహాకు సీట్ ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రూ తమ సెలవులను థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో గడుపుతున్నారు.

Tags:    

Similar News