ప్రేమించిన వ్యక్తి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేష్
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా మెప్పించిన ఐశ్వర్య రీసెంట్ గా తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించింది.
ఐశ్వర్యా రాజేష్ సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్ కు వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా మెప్పించిన ఐశ్వర్య రీసెంట్ గా తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించింది.
చిన్న తనంలోనే తన తండ్రి చనిపోవడంతో అమ్మ ఒక్కరే తమ నలుగుర్ని ఎంతో కష్టపడి పెంచిందని, ఆ క్రమంలో ఆమె ఎన్నో ఇబ్బందులు పడిందని తెలిపింది. అమ్మ కష్టం చూసి ఆమెకు అండగా నిలబడాలని చిన్న వయసు నుంచే పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం మొదలుపెట్టిన ఐశ్వర్య క్రమంగా సినిమాల్లోకి వచ్చి అమ్మను చూసుకుంటున్నానని, ఆ విషయంలో తానెంతో గర్వంగా ఉన్నట్టు అమ్మడు తెలిపింది.
ఇక రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ, లవ్ కంటే బ్రేకప్ అయినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుందని, ఆ బాధ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదని, అందుకే దానికే ఎక్కువ టైమ్ తీసుకుంటానని చెప్పిన ఐశ్వర్య తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని, అతన్నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడించింది.
దాని కంటే ముందు కూడా తాను అలాంటి ప్రేమనే చూశానని, రిలేషన్‌షిప్‌లో ఎందుకిలా జరుగుతుందని ఎంతో భయపడినట్టు చెప్తున్న ఐశ్యర్య ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, గతంలో జరిగిన అనుభవాల వల్ల మళ్లీ ఎవరినైనా ప్రేమించాలంటే ఎన్నో ఆలోచనలొస్తున్నాయని ఐశ్వర్య తెలిపింది. తాను చాలా ఎమోషనల్ అని మళ్లీ మళ్లీ అంత బాధను తట్టుకునే శక్తి తనకు లేదని, ప్రస్తుతం సింగిల్ గా ఉన్నప్పటికీ ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇక కెరీర్ విషయానికొస్తే సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత తనకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ అమ్మడు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది.