ఐశ్వర్య-ధనుష్ మళ్లీ కలిసిపోతున్నారా?
ధనుష్- ఐశ్వర్య జంట బ్రేకప్ వార్తలు అభిమానుల్లో కలవరానికి కారణమైన సంగతి తెలిసిందే.
ధనుష్- ఐశ్వర్య జంట బ్రేకప్ వార్తలు అభిమానుల్లో కలవరానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన ఈ జంట 18ఏళ్ల కాపురం అనంతరం విడిపోవడం విచారకరం. జనవరి 2022లో తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వారి మధ్య విభేదాలను సరిదిద్దడానికి పెద్దలు ప్రయత్నించినా వారికి కలిసే ఆలోచన లేదని తెలిసింది. కలిసేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నించడం లేదని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ``ధనుష్ ఐశ్వర్యతో రాజీపడే ఆలోచనలో లేడు. వారు విడిపోవడానికి అంగీకరించారు. ఎవరి దారిలో వారు వెళుతున్నారు. ఈ కీలక మలుపులో వారు కలిసి ఉండలేమని అంగీకరించారు. అయితే ఈ జంట తమ పిల్లలైన యాత్ర -లింగాలను సహ-తల్లిదండ్రులుగా కొనసాగే ప్రణాళికపై దృష్టి సారిస్తున్నారు..`` అని తెలిసింది.
ఈ జంటపై `సయోధ్య` పుకార్లు నిరాధారమైనవి. వారు తిరిగి కలిసిపోయేందుకు ప్రయత్నించడం లేదు. వారు అధికారికంగా విడాకుల కోసం దాఖలు చేయనప్పటికీ ప్రస్తుతానికి విడిపోయారు. చట్టపరమైన దాఖలాలు లేదు. వారిలో ఒకరు ప్లాన్ చేస్తే తప్ప విడాకుల గురించి ఆలోచించరు. వారు కలిసి నివసించడం లేదు. కానీ వారు పరస్పర గౌరవాన్ని కలిగి ఉంటారు. వారి పిల్లల విషయంలో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తారు. పిల్లలను పెంచడంలో సహ-తల్లిదండ్రులుగా ఉంటారు. వారి పిల్లలు తమ జీవితాల్లో శూన్యతను అనుభవించకుండా చూసుకోవాలని భావిస్తున్నారు... అని సదరు కథనం ఉటంకించింది.
ప్రస్తుతం ఐశ్వర్య రజనీకాంత్ `లాల్ సలామ్` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్య దర్శకురాలు. విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపిస్తారు. చిత్రీకరణ పూర్తయింది. 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు `కెప్టెన్ మిల్లర్` విడుదల కోసం ధనుష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తదుపరి వరుస చిత్రాలు చేయాల్సి ఉంది. కెరీర్ 50వ చిత్రానికి టైమ్ దగ్గరపడింది. శేఖర్ కమ్ముల, అరుణ్ మాథేశ్వరన్లతో దనుష్ సినిమాలు చేస్తున్నాడు.