ఐశ్వ‌ర్యారాయ్ విడాకుల ప్ర‌చారానికి చెక్

జ‌యాబ‌చ్చ‌న్ తో కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్‌కి కొన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, అమితాబ్ కుమార్తె శ్వేతాబచ్చ‌న్ నందా- ఐష్ కి ఈగో ఇష్యూస్ ఉన్నాయ‌ని, ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది.

Update: 2023-12-06 16:48 GMT

ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోయారని చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. బ‌చ్చ‌న్ కుటుంబంలో క‌ల‌త‌లు ఉన్నాయ‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం సాగుతూనే ఉంది. జ‌యాబ‌చ్చ‌న్ తో కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్‌కి కొన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, అమితాబ్ కుమార్తె శ్వేతాబచ్చ‌న్ నందా- ఐష్ కి ఈగో ఇష్యూస్ ఉన్నాయ‌ని, ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది.

అయితే అభిషేక్- ఐశ్వ‌ర్యారాయ్ ఇటీవ‌ల ఈ పుకార్లకు స్పందించ‌కుండా స్త‌బ్ధుగా ఉన్నారు. పబ్లిక్ ఔటింగుల్లోను పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అయితే తాజాగా ఓ కీల‌క‌ ఈవెంట్లో జంట‌గా క‌నిపించి అన్ని పుకార్లకు స్వస్తి పలికారు. ఈ జంట త‌మ కుమార్తె ఆరాధ్య బ‌చ్చ‌న్ తో క‌లిసి `ది ఆర్చీస్` ప్రీమియర్‌కి వచ్చారు. వారి కుటుంబంతో ఈవెంట్ లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అమితాబ్ బచ్చన్, ఆరాధ్య కూడా అభిషేక్- ఐష్‌ జంటతో పోజులిచ్చారు.

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఈవెంట్‌కు వచ్చినప్పుడు కెమెరాల కోసం నవ్వుతూ కనిపించారు. అగస్త్య నందా తొలి చిత్రం `ది ఆర్చీస్` ప్రీమియర్ కోసం బచ్చన్ కుటుంబం కలిసి రావడంపై సోషల్ మీడియాల్లో బోలెడంత చ‌ర్చ సాగుతోంది. అయితే నెటిజ‌నుల్లో ఒకరు ``అభిషేక్ -ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు అనిపిస్తోంది.. వారిని చూడండి`` అని వ్యాఖ్యానించ‌గా, రెండో వ్య‌క్తి ఐశ్వర్య ఆరాధ్యను పట్టించుకోలేదు! అని వ్యాఖ్యానించాడు. ఐశ్వర్య- అభిషేక్ విడాకులు తీసుకోరని నేను నిజంగా ఆశిస్తున్నాను అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, ``అందరూ నోరు తెరిచి ఐశ్వర్య - అభిషేక్‌ల విడాకుల గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో వారు నిరాశ చెందారు. ప్ర‌జ‌లు ఇతరుల ఇళ్లను నాశనం చేయడాన్ని, వారికి హాని కలిగించడాన్ని ఇష్టపడతారు! అని వేరొక‌రు రాసారు.

జోయా అక్తర్ తెర‌కెక్కించిన `ది ఆర్చీస్` నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రానుంది. షారుఖ్ ఖాన్ -గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ మనవడు అగస్త్య నందా, బోనీ కపూర్, దివంగత శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్‌ల తొలి చిత్రమిది. సినిమా ప్రకటించినప్పటి నుండి తన సినిమాల్లో నెపో కిడ్స్ ని నటింపజేయాలనే నిర్ణయంపై ద‌ర్శ‌కురాలు జోయాని నెటిజ‌నులు తీవ్రంగా ప్రశ్నించారు.

అయితే ఇటీవల జోయా తండ్రి - ది ఆర్చీస్‌లో పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత-స్క్రీన్‌రైటర్ జావేద్ అక్తర్ తన కుమార్తెను సమర్థించారు. హిందీ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి సాధ్యం కాదని కూడా ఆయ‌న చెప్పారు. ఎవరిని అయినా ప్ర‌జ‌లు అంగీకరించినప్పుడే పరిశ్రమలో విజయం సాధిస్తారు అని అన్నారు.

బంధు ప్రీతికి డెఫినిష‌న్ చెప్పారు:

సాహితీ ఆజ్ తక్ కార్యక్రమంలో జావేద్ హిందీలో మాట్లాడుతూ ``సినిమా పరిశ్రమలో బంధుప్రీతి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బంధుప్రీతి ప్రపంచంలో ప్రతిచోటా ఉంటుంది. కానీ ఇక్కడే ఎందుకు ఈ చ‌ర్చ‌? ఇక్కడ వాతావ‌ర‌ణం ఎన్నికల వంటిది. ఇక్కడ ఒక న‌టుడు లేదా న‌టి ప్రేక్షకులకు నచ్చితేనే విజయం సాధిస్తాడు. కాబట్టి మీరు ఇక్కడ ఒకరిని స్టార్‌ని చేయలేరు. స్టార్‌లను ప్రేక్షకులు తయారు చేస్తారు.. అని వ్యాఖ్యానించారు.

అర్హత లేని వ్యక్తికి మీరు వేరొకరి ఖర్చు(డ‌బ్బు)తో సహాయం చేసినప్పుడు బంధుప్రీతి అనుకోవ‌చ్చు. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. నన్ను నా నగరానికి చెందిన వారు అని విశ్వసించి ఉద్యోగం ఇచ్చారు. అలా తీసుకోవ‌డంలో నాకు ఎలాంటి ప్రమాదం లేదు. అది బంధుప్రీతి. ఇది బ్యూరోక్రసీలో కింది స్థాయిలో వ్యక్తులను నియమించుకునే అధికారం పొందే ఏజెన్సీలలో జరగవచ్చు. కానీ ఇక్కడ నిర్మాత‌లు లేదా ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు తమకు తాముగా స్వ‌యంగా రిస్క్ తీసుకుంటున్నందున ఇది ఆశ్రిత పక్షపాతం కాదు.. వారు మరొకరిపై ఆధారపడటం లేదు... అని సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

Tags:    

Similar News