చెట్టుతో పెళ్లి..! ఐష్ స‌మాధానం చెప్ప‌లేక..!!

అభిషేక్ బచ్చన్‌తో తన వివాహానికి ముందు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యరాయ్ చెట్టును వివాహం చేసుకున్నార‌ని అప్ప‌ట్లో పుకార్లు వ‌చ్చాయి

Update: 2024-07-23 01:30 GMT

అభిషేక్ బచ్చన్‌తో తన వివాహానికి ముందు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యరాయ్ చెట్టును వివాహం చేసుకున్నార‌ని అప్ప‌ట్లో పుకార్లు వ‌చ్చాయి. 2007లో జరిగిన ఈ వివాహానికి సంబంధించి ప్ర‌జ‌ల్లో చాలా ప్ర‌చారాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఈ విచిత్రమైన వాదన ఒక‌టి తెర‌పైకొచ్చింది. జ్యోతిష్కుల సూచ‌న మేర‌కు ఐశ్వర్య రాయ్ జీవితంలో చెడు శకునాలను నివారించడానికి, పెళ్లి కి ముందు చెట్టును పెళ్లాడే ఆచారాన్ని నిర్వహించిందని పుకార్ వ‌చ్చింది.

అయితే 2008లో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఇలాంటి పుకార్లతో ఇబ్బంది గురించి ప్ర‌స్థావించారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు ఇబ్బందికి గుర‌య్యాన‌ని అన్నారు. ఈ ఊహాగానాలను అనవసరమైన‌విగా అభివర్ణించింది. ఆ పుకార్ తన పెళ్లిలోని ఆనందాన్ని ఎలా దూరం చేసిందో ప్ర‌స్థావించారు ఐష్‌. ఇటువంటి హాస్యాస్పదమైన వాదనలపై ప్ర‌జా దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది.. అలాంటివి అసమంజసమైనవ‌ని ఐశ్వర్య రాయ్ పేర్కొంది. వారణాసిలో `కుంభ వివాహ వేడుక`లో పాల్గొంద‌ని కూడా పుకార్లు వ‌చ్చాయ‌ని ఐష్‌ గుర్తుచేసుకుంది. ఇది త‌న మాంగ్లిక్ హోదాను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఆచారం. అయితే ఐశ్వర్య .. త‌న‌ కుటుంబం కూడా అలాంటి వేడుక జరగలేదని మీడియా ఎదుట ఖండించారు. ఐశ్వ‌ర్యారాయ్ మామ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. చెట్టుతో ఐష్‌ పెళ్లి గురించి హాస్యాస్పదంగా పేర్కొన్నారు.

నిజానికి ఇలాంటి ప్ర‌చారాలు ఎన్ని ఉన్నా కానీ... ఐశ్వర్య తన కుటుంబం, కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. ఐష్‌- అభిషేక్ 2011లో తమ కుమార్తె ఆరాధ్యను స్వాగతించారు. ఆ ఇద్ద‌రూ బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఈ జంట ప్రజా జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. మీడియా క‌థ‌నాలు త‌మ‌ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కానీ.. బంధం ప్రాముఖ్యతను ఐష్‌- అభిషేక్ జంట ప్ర‌తిసారీ నొక్కి చెబుతారు.

Tags:    

Similar News