పిక్ టాక్ : ఆమె కోసం షూటింగ్ వదిలేసి..!
ఇటీవలే ఆరవ్ తో కలిసి అజిత్ కార్ చేజ్ సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్నాడు.
తమిళ్ సూపర్ అజిత్ కుమార్ గత రెండు వారాల నుంచి 'విడముయార్చి' షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆరవ్ తో కలిసి అజిత్ కార్ చేజ్ సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్నాడు. అజర్‌బైజాన్ లో స్పీడ్ గా జరుగుతున్న షూటింగ్ కి అజిత్ బ్రేక్ ఇచ్చాడు.
మరో రెండు వారాల పాటు అజర్‌బైజాన్ షూటింగ్ లో పాల్గొనాల్సిన అజిత్ హఠాత్తుగా ఒక్కడు చెన్నైకి రావడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకు అజిత్ కుమార్ ఎందుకు చెన్నై వచ్చాడు అనే విషయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భార్య షాలిని కోసం ఆయన షూటింగ్ ను మధ్యలో వదిలేసి వచ్చాడు.
అనారోగ్య సమస్య కారణంగా ఒక చిన్న ఆపరేషన్ కి షాలిని రెడీ అయ్యింది. ఆమె పక్కన ఈ సమయంలో ఉండాల్సిన బాధ్యత భర్తగా అజిత్ కు ఉంది. అందుకే తన అవసరం ఉందని భావించి వెంటనే సినిమా షూటింగ్ ను వదిలేసి చెన్నైకి అజిత్ వచ్చాడని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.
ఆసుపత్రిలో ఉన్న షాలిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అజిత్ తన పక్కన ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో తో పాటు లవ్ యు ఫరెవర్ అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేసింది. ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ సినిమాలు, బైక్ రైడ్ లు అంటూ తిరిగే అజిత్ తన భార్య వెంట ఇలాంటి సమయంలో నిలవడం అభినందనీయం.
ఇక విడముయార్చి సినిమా షూటింగ్ కి రెండు మూడు రోజుల్లో తిరిగి అజిత్ కుమార్ అజర్‌బైజాన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో రెండు మూడు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్న విడముయార్చి సినిమాను అక్టోబర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.