ఒక్క రిలీజ్ కూడా కాలేదు.. చేతిలో మరో మూడు సినిమాలు
అయితే ఎవరికైనా సరే మొదటి సినిమా రిలీజై, ఆ సినిమా విజయం సాధిస్తే తర్వాత వరుసపెట్టి అవకాశాలొస్తాయి కానీ ఆకాంక్ష శర్మకు మాత్రం మొదటి సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే అవకాశాలు క్యూ కడుతున్నాయి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమాతో ఆకాంక్ష శర్మ అనే కొత్త భామ హీరోయిన్ గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆకాంక్ష తర్వాత మ్యూజిక్ వీడియోల ద్వారా బాగా పాపులరైంది. ఆకాంక్ష హీరోయిన్ గా తెరకెక్కిన లైలా సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఎవరికైనా సరే మొదటి సినిమా రిలీజై, ఆ సినిమా విజయం సాధిస్తే తర్వాత వరుసపెట్టి అవకాశాలొస్తాయి కానీ ఆకాంక్ష శర్మకు మాత్రం మొదటి సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే అవకాశాలు క్యూ కడుతున్నాయి. అమ్మడి చేతిలో ఆల్రెడీ నాలుగు సినిమాలున్నాయి. ఆ నాలుగు సినిమాల్లో మొదట రిలీజయ్యేది విశ్వక్ తో చేసిన లైలానే.
లైలా ముందు రిలీజవుతుంది కాబట్టి ఆకాంక్ష డెబ్యూ మూవీ అదే అవుతుంది. లైలా రిలీజయ్యాక ఒక్కోదానికి కాస్త గ్యాప్ లోనే ఆకాంక్ష నటించిన మరో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాస్తవానికి అమ్మడు తెలుగు సినిమా ఒప్పుకోకముందో బాలీవుడ్ లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుని అవి ఆల్మోస్ట్ పూర్తి చేసింది.
అందులో ఓ మూవీ సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న కేసరి వీర్. పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆకాంక్షకు కీలక పాత్ర దక్కినట్టు సమాచారం. మరోవైపు మిలర్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తేరా యార్ హూ మై అనే సినిమాలో కూడా ఆకాంక్ష నటిస్తోంది. అమన్ ఇంద్ర కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమానే ఆకాంక్ష అన్నింటికంటే ముందుగా సైన్ చేసిన సినిమా.
తేరా యార్ హూ మై లో ఆకాంక్ష కు ఇంప్రెస్ అయిన డైరెక్టర్ మిలప్, తన దర్శకత్వంలో రానున్న మరో సినిమాలో కూడా ఆకాంక్షకు అవకాశమిచ్చాడు. ఏదేమైనా నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే మూడు సినిమాల్లో ఛాన్సులందుకోవడమంటే అమ్మడి లక్ మామూలుగా లేదు. లైలా రిలీజ్ తర్వాత టాలీవుడ్ నుంచి కూడా మరిన్ని అవకాశాలొచ్చే వీలుంది.
రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలా సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఓ సాంగ్ లో ఆకాంక్ష తన శరీర అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ తప్పకుండా అలరిస్తుందని లైలా చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.