రెండేళ్ల త‌ర్వాత సెట్స్ లోకి అడుగుపెట్ట‌నున్న అఖిల్

కాస్త లేటైనా స‌రే అఖిల్ ఈసారి క‌చ్ఛితంగా హిట్ కొట్టాల‌ని ఎంతో క‌సిగా ఉన్నాడు.;

Update: 2025-03-11 08:15 GMT

అక్కినేని వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ కు ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఏజెంట్ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మిగిలింది. ఏజెంట్ వ‌చ్చి రెండేళ్లవుతున్నా అఖిల్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న త‌ర్వాతి సినిమాను మొద‌లుపెట్ట‌లేదు. కాస్త లేటైనా స‌రే అఖిల్ ఈసారి క‌చ్ఛితంగా హిట్ కొట్టాల‌ని ఎంతో క‌సిగా ఉన్నాడు.

ఈ నేప‌థ్యంలోనే అఖిల్ చాలా క‌థ‌లు కూడా విన్నాడు. ఎన్నో క‌థ‌లు విన్న అఖిల్ ఓ క‌థ ద‌గ్గ‌ర ఆగాడు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫేమ్ నందు చెప్పిన క‌థకు అఖిల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మార్చి 14 నుంచి మొద‌లు కానున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి రెండేళ్ల త‌ర్వాత అఖిల్ తిరిగి సినిమా సెట్స్ లో కాలు పెట్ట‌బోతున్నాడ‌న్న‌మాట‌.

వాస్త‌వానికి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా క‌థను కావాల‌ని సాహు గార‌పాటి రెడీ చేయించుకున్నార‌ట‌. క‌థ గురించి విన్న నాగార్జున సాహుని రిక్వెస్ట్ చేసి మ‌రీ ఆ క‌థ‌ను కావాల‌ని తీసుకున్నార‌ట‌. అక్కినేని ఫ్యామిలీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు బాగా క‌లిసొస్తాయ‌ని, అఖిల్ కోసం అలాంటి క‌థ‌నే వెతుకుతున్నామ‌ని చెప్పి, నాగ్ ఆ క‌థ‌ను సాహు నుంచి తీసుకున్నార‌ట‌.

ఇప్పుడు ఆ క‌థ‌తోనే నాగార్జున త‌న సొంత బ్యాన‌ర్ లో అఖిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ చిత్తూరు జిల్లాలోనే ఉంటుంద‌ని, సినిమాలో చిత్తూరు యాస కూడా ఉంటుంద‌ని, చిత్తూరు ఏరియాలోని భార‌తం మెట్ట అనే కొండ‌ప్రాంతంలో అఖిల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్కువ‌గా జ‌ర‌గ‌నుందని స‌మాచారం.

2016లో సోగ్గాడే చిన్ని నాయ‌న‌, 2022లో బంగార్రాజు అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసి సూప‌ర్ హిట్లు కొట్టిన నాగార్జున‌, 2024లో నా సామి రంగ‌తో స‌క్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గా నాగ చైత‌న్య బ్లాక్ బ‌స్ట‌ర్ తండేల్ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిందే. అఖిల్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేయ‌లేదు. అందుకే నాగ్ కావాల‌ని ప‌ట్టు ప‌ట్టి మ‌రీ ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీని అఖిల్ కోసం సెట్ చేశార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News