అఖిల్.. హిట్టు కోసం మళ్ళీ ఆ రూట్లోనే..
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో లవ్ స్టోరీగా ఈ చిత్ర కథ ఉండబోతోందంట.
అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. వీటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రం కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మొదటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ అయ్యింది. రెండో మూవీ 'హలో' కూడా పరవాలేదు అనిపించినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. మూడో చిత్రంగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నాలుగో చిత్రంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వచ్చి హిట్ అయ్యింది.
తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన 'ఏజెంట్' మూవీ అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ యూవీ క్రియేషన్స్ అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గుసగుసలు వినిపించాయి. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు తన హోమ్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ అబ్బూరుతో ఈ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో లవ్ స్టోరీగా ఈ చిత్ర కథ ఉండబోతోందంట.
రెగ్యులర్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండవని సమాచారం. సరికొత్త పాయింట్ తో కథని చెప్పబోతున్నారంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు. అఖిల్ తన హోమ్ బ్యానర్ లో చివరిగా హలో మూవీ చేశారు. దీని తర్వాత ఇప్పుడు మురళీ కిషోర్ తో మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. మొదటి సినిమాని యాక్షన్ జోనర్ లో చేసి ఫెయిల్యూర్ అందుకున్న అఖిల్ తరువాత లవ్ స్టోరీస్ తోనే మూవీస్ చేశాడు.
మరల 'ఏజెంట్' తో మరోసారి యాక్షన్ ట్రై చేసిన వర్క్ అవుట్ కాకపోవడంతో యూటర్న్ తీసుకొని ప్రేమకథని ముందుగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడంట. ఈ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో కమిట్ అయిన యాక్షన్ మూవీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయిన అఖిల్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ వస్తుందా అనేది వేచి చూడాలి.